చిరు – కొర‌టాల మూవీకి రాజ‌మండ్రి ట‌చ్?

Chiranjeevi - Koratala Siva Movie Team Heads To Rajahmundry For Movie Shooting

`ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా… న‌ర‌సింహారెడ్డి`తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన‌ మెగాస్టార్ చిరంజీవి… త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి `ఆచార్య‌` అనే టైటిల్ ప‌రిశీల‌నలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ద‌స‌రాకి పూజా కార్యక్ర‌మాలు జ‌రుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల 26 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంద‌ని తెలిసింది. హైద‌రాబాద్ కోకాపేట్ లోని చిరు ఫామ్ హౌస్ లో తొలి షెడ్యూల్ ని ప్లాన్ చేశార‌ని టాక్. అనంత‌రం రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ జ‌రుగుతుంద‌ని… ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటుంద‌ని వినికిడి. రాజ‌మండ్రి నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ సినిమాలో కీల‌కంగా ఉంటాయ‌ని అంటున్నారు.

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీల‌ను అందిస్తున్నాడు. 2020 ద‌స‌రాకి `చిరు 152` థియేట‌ర్ల‌లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 3 =