బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వెంకీమామ’. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ `వెంకీమామ`కి `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంకా విడుదలకు రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న వెంకటేష్ మల్టీస్టారర్ల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ తరం జనరేషన్ తో కూడా మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుందని చెప్పారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ – ప్రభాస్ – రామ్ చరణ్ వంటి హీరోలతో వర్క్ చేయడానికి రెడీ ఉన్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే వెంకీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్, వరుణ్ తేజ్ తో చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మేనల్లుడు నాగ చైతన్యతో వస్తున్నాడు. మరి వెంకీ ఓకే ప్రభాస్, ఎన్టీఆర్ ఎప్పుడు ఓకే చెపుతారో చూద్దాం.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో.. వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. మరి చూద్దాం మామా అల్లుళ్లు తెరపై ఎలాంటి సందడి చేయబోతున్నారో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: