
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 101


`భారతీయుడు 2` చిత్రం కోసం కాజల్ న్యూ లుక్

మజిలీ సెకండ్ లుక్ రిలీజ్- రిలీజ్ డేట్ ఖరారు

అదృశ్యం ట్రైలర్ లాంచ్

ప్లే బాయ్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ?

మెహరీన్ కు మరోసారి కలిసొచ్చారు

అనుష్క సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో

జూన్ నుంచి మహేష్, సుకుమార్ చిత్రం?

రజనీకాంత్, మురుగదాస్ సినిమా అప్‌డేట్

సంక్రాంతి తరువాతే `సైరా` నెక్ట్స్ షెడ్యూల్

2.0 మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

అరవింత సమేత తరువాత మళ్లీ యాత్రలో!

ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న వినాయక్

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫస్ట్ లుక్ రిలీజ్
స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఇటీవలే ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేయగా..చాలా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆయితే కాస్త డిఫరెంట్ గా రిలీజ్ చేశారు. మీ పందెం కోళ్లను ఎవరు మాయం చేశారో,మీ గాలిపటాల్ని తెంపేసిందెవరో మేము కనుక్కుంటాము.మీరు బొబ్బట్లు తిని పండగ చేస్కోండి అంటూ కామెడీగా చెబుతూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

`భారతీయుడు 2` చిత్రం కోసం కాజల్ న్యూ లుక్
తెలుగు, తమిళ భాషల్లో పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి... సంచలన విజయాలను అందుకుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరో మెగా బడ్జెట్ మూవీలో నటిస్తోంది. అదే... `భారతీయుడు 2`. లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందించిన `భారతీయుడు` (1996)కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హీరోయిన్‌గా నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది కాజల్. అంతేకాదు... ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుందట. పాత్ర రీత్యా... పడుచు అమ్మాయిగానూ, వయసు మళ్ళిన స్త్రీగానూ కాజల్ కనిపించనుందట. `వయసు మళ్ళిన స్త్రీ`…

మజిలీ సెకండ్ లుక్ రిలీజ్- రిలీజ్ డేట్ ఖరారు
పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మజిలీ. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ లో సమంత-నాగచైతన్య ఉండగా..ఇప్పుడు దివ్యంశ కౌశిక్ - నాగ చైతన్య సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. దానితో పాటు మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు.

అదృశ్యం ట్రైలర్ లాంచ్
వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవిప్రకాష్ కృష్ణం శెట్టి నిర్మించిన చిత్రం అదృశ్యం. హారర్, థ్రిల్లర్, కామెడి, ప్రధానాంశముగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ను శనివారం ఫిల్మిఛాంబర్లో హీరో జాన్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో... మ్యూజిక్ డైరెక్టర్ ఆల్డ్రిన్ మాట్లాడుతూ... తెలుగులో ఇది నా మొదటి చిత్రం. బేసిక్గా నేను తెలుగువాడిని కాకపోతే చెన్నైలో సెటిల్ అయ్యాను. శ్రవంతి మూవీస్కి వర్క్ చేశాను. నేను చెన్నైలో మ్యూజిక్ కోర్సు చేశాను. తమిళ్లో దాదాపుగా 7 చిత్రాలకు సంగీతాన్ని అందించాను. ఈ సంవత్సరం…

ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘సమరసింహారెడ్డి’కి 20 ఏళ్ళు
తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయే సినిమాలలో... నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సమరసింహారెడ్డి’ ఒకటి. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో... కొన్నేళ్ళ పాటు తెలుగు సినిమా ఫ్యాక్షన్ బాట పట్టింది. మరికొన్ని ఘనవిజయాలనూ మూటగట్టుకుంది. ఇక ‘సమరసింహారెడ్డి’ విషయానికొస్తే... నందమూరి బాలకృష్ణలోని నటుడ్ని కొత్తగా ఆవిష్కరించిన చిత్రమిది. నవరసాలను అద్భుతంగా పలికించి... అభిమానుల చేతే కాదు... సగటు ప్రేక్షకుల నుంచి కూడా జేజేలు అందుకున్నాడు. సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో…

ప్లే బాయ్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ?
టాలీవుడ్‌లో `షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్`... అదే `ప్లే బాయ్` క్యారెక్టర్‌లతో సందడి చేస్తున్న కథానాయకుల సంఖ్య పెరుగుతోందా? దీనికి సమాధానంగా అవుననే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో 18 ఏళ్ళ క్రితం `ప్రేమతో...రా!` అంటూ విక్టరీ వెంకటేష్ ప్లే బాయ్ గా అలరిస్తే... 8 ఏళ్ళ క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ `ఆరెంజ్`తో షార్ట్ టర్మ్ లవ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మ్యూజికల్ గా ఈ రెండు సినిమాలూ మెప్పించాయి. ఇక వర్తమానంలోకి వస్తే... అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న `Mr. మజ్ను` కూడా ఓ షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్ కథే. ఇప్పుడు ఈ హీరోల బాటలోనే... యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కూడా…

మెహరీన్ కు మరోసారి కలిసొచ్చారు
కెరీర్ ఆరంభంలో వరుసగా మూడు విజయాలను అందుకుని `హ్యాట్రిక్ హీరోయిన్` అనిపించుకుంది... పంజాబీ జాబిలి మెహరీన్. `కృష్ణగాడి వీరప్రేమగాథ`, `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో... సంక్రాంతి కానుకగా శనివారం విడుదలైన `ఎఫ్ 2` హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా... వసూళ్ళ పరంగానూ మెప్పిస్తోంది. దీంతో... మెహరీన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసినట్లే. కేవలం సక్సెస్ మాత్రమే కాదు... నటిగానూ మరోసారి తన ప్రతిభను చాటుకుంది ఈ పంజాబీ జాబిలి. `హనీ ఈజ్ ద బెస్ట్`…

సంక్రాంతి సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్
ఈ సంక్రాంతికి పలు సినిమాలే బరిలో దిగాాయి. జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 10 వ తేదీన పేట, జనవరి 11వ తేదీన వినయ విధేయ రామ, జనవరి 12 ఎఫ్2 సినిమాలు రిలీజయ్యాయి. ఒక్కొక్క జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాలు ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరి ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

అనుష్క సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో
భాగమతి మూవీ తర్వాత దాదాపు అనుష్క సినిమా వచ్చి దాదాపు సంవత్సరమైపోయింది. అప్పటి నుండి ఇప్పటివరకూ అనుష్క కొత్త సినిమా మాత్రం ప్రారంభం కాలేదు. ఇక ఈ ఏడాది అనుష్క కొత్త మూవీకి సైన్ చేసింది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో... హేమంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మార్చి నుండి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

దొంగరాముడు లో భానుమతి వెయ్యవలసిన వేషం సావిత్రికి ఎలా వచ్చింది?
ఇక నటీనటుల విషయానికి వస్తే అన్నపూర్ణ సంస్థలో అగ్రనటిగా, సంస్థకు అత్యంత ఆప్తురాలిగా వెలిగిన నటి సావిత్రి. కాకినాడ పరిషత్తు పోటీలలో పృథ్వీరాజ్ కపూర్ చేతులమీదుగా బహుమతి అందుకున్నప్పటి నుండి సావిత్రి మధుసూదనరావుకు బాగా తెలుసు. ఆమెను ఎల్ వి ప్రసాద్ "సంసారం" చిత్రంలో బుక్ చేసి తీసేసినప్పుడు మధుసూదనరావు ఎంతో బాధ పడ్డారు.' బతుకు తెరువు' చిత్రంలో ఒక చిన్న పాత్ర చేసిన తరువాత" దేవదాసు" చిత్రం పెద్ద హిట్ అవటంతో సావిత్రి దశ తిరిగింది. " దొంగ రాముడు” చిత్రంలో హీరోయిన్ గా భానుమతిని బుక్ చేయాలన్నది మధుసూదనరావు అభిప్రాయం. వరవిక్రయం, స్వర్గసీమ, మల్లీశ్వరి చిత్రాలు చూసి భానుమతి అభిమాని అయ్యారు మధుసూదన రావు…

బాలయ్యకు డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు మరోసారి బాలకృష్ణపై సెటైర్లు వేశారు. గతంలో బాలయ్య అంటే ఎవరో తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది. ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించి నాగబాబుపై విమర్శలు గుప్పించారు. దాంతో నాగబాబు ఆ విమర్శలపై స్పందించి... సారీ బాలయ్య నాకు తెలియకపోవడం ఏంటీ.. ఆయన చాలా మంచి కమెడియన్.. నాకు తెలియదని చెప్పడం తప్పే అంటూ ఆనాటి కమెడియన్ బాలకృష్ణ ఫొటో చూపిస్తూ.. కాస్త ఎటకారంగానే సమాధానం ఇచ్చారు. దాంతో బాలకృష్ణ అభిమానులు ఇంకా రెచ్చిపోయి నాగబాబుపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.. ఇంకా విమర్శిస్తునే ఉన్నారు.

జూన్ నుంచి మహేష్, సుకుమార్ చిత్రం?
గత ఏడాది వేసవికి `భరత్ అనే నేను`తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈ ఏడాది వేసవికి `మహర్షి`తో పలకరించనున్నాడు. అంతేకాదు... ఈ సినిమాతో కథానాయకుడిగా 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, `దిల్` రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న `మహర్షి` తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రం విడుదలయ్యాక తన కుటుంబంతో కలసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయనున్న మహేష్... జూన్ నుంచి తన తదుపరి చిత్రాన్ని…

రజనీకాంత్, మురుగదాస్ సినిమా అప్‌డేట్
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం `పేట`... ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. `బాషా` తరువాత మళ్ళీ 24 ఏళ్ళ అనంతరం ... సంక్రాంతికి వస్తున్న రజనీకాంత్ సినిమా కావడంతో... `పేట`పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 10న తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే... `పేట` రిలీజ్ అయిన వెంటనే... రజనీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం... బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఫిబ్రవరిలో పట్టాలెక్కనుందని తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా…

సంక్రాంతి తరువాతే `సైరా` నెక్ట్స్ షెడ్యూల్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా... మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించి... తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తరువాత హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగనుందని సమాచారం. అంతేకాదు... మార్చి చివరి నాటికి చిత్రీకరణ పూర్తిచేసి... ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించనున్నారని…

పవన్ కళ్యాణ్ `బాలు`కి 14 ఏళ్ళు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలిప్రేమ’. 1998లో విడుదలైన ఈ చిత్రంతోనే దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు `ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్` ఎ.కరుణాకరన్. దాదాపు ఏడేళ్ళ విరామం తరువాత... ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మరో మ్యూజికల్ హిట్ `బాలు`. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో పవన్‌కి జోడీగా శ్రియ, నేహా ఒబెరాయ్ నటించగా... జయసుధ, తనికెళ్ళ భరణి, సునీల్, బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

యన్టీఆర్ `సీతారామ కళ్యాణం`కి 58 ఏళ్ళు
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పౌరాణిక చిత్రం ‘సీతారామ కళ్యాణం’. ఈ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన యన్టీఆర్... తన దర్శకత్వ ప్రతిభతో తొలి చిత్రంతోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు. యన్.ఏ.టి పతాకంపై యన్టీఆర్ సోదరుడు యన్. త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమాకు యన్టీఆర్ దర్శకత్వం వహించడంతో పాటు... రావణాసురుడి పాత్రలో నటించడం కూడా జరిగింది. యన్టీఆర్‌కు జంటగా బి.సరోజాదేవి నటించగా... హరనాథ్, గీతాంజలి, శోభన్‌బాబు, నాగయ్య, కాంతారావు, గుమ్మడి ముఖ్యపాత్రల్లో కనిపించారు. గాలి పెంచల నరసింహారావు సంగీతం అందించిన ఈ…

2.0 మూవీ క్లోజింగ్ కలెక్షన్స్
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విజువల్ వండర్ 2.0. భారతీయ సినిమా చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా రూ.550 కోట్ల బడ్జెట్‌తో త్రీడీ టెక్నాలజీతో రూపొందింది 2.0 సినిమా. మరి నవంబర్ 29వ తేదీన రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్లు సాధించింది. 2.0 క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి... ఈ చిత్రం రిలీజ్ ముందు హడావిడి చేసినా తరువాత ఆశించిన స్ధాయిలో కలెక్షన్స్ రాలేదు కానీ ఆతరువాత మాత్రం పుంజుకొని భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంది. అయితే హిందీ లో ఈ సినిమా మంచి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

అరవింత సమేత తరువాత మళ్లీ యాత్రలో!
సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పడానికి ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ నిలిచాడు.

ఎస్. రాజేశ్వరరావు గారికి కొంచెం బద్దకిస్ట్ అనే పేరుంది- దుక్కిపాటి
స్వర్ణ యుగంలో అన్నపూర్ణ ధారావాహిక ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో ప్రస్తుతం దుక్కిపాటి మధుసూదనరావు తమ సంస్థలో పనిచేసిన నటీ నట సాంకేతిక వర్గానికి, ఇతర ప్రముఖులకు కృతజ్ఞతలు చెబుతున్న ఘట్టంలో ఉన్నాం. గత ఎపిసోడ్ లో తమ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు, తమ తొలి చిత్ర దర్శకుడు కేవీరెడ్డి, తమ సంస్థలో 12 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావుకు, 14 చిత్రాలకు ఛాయాగ్రహణం నిర్వహించిన సెల్వరాజ్ ల గురించి దుక్కిపాటి వివరించిన విశేషాలను మీ ముందు వుంచాను. ఇప్పుడు మిగిలిన నటీనటులు సాంకేతిక వర్గానికి దుక్కిపాటి ఎలా తన కృతజ్ఞతాంజలి ఘటించారో చూద్దాం.

ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న వినాయక్
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ ల లిస్ట్ లో వి.వి వినాయక్ కూడా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా ఉండేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. ఎంతో మంది కొత్త వాళ్లు తెలుగు తెరకు పరిచయమవుతున్న నేపథ్యంలో పాత డైరెక్టర్లు కూడా పాతబడిపోతున్నారు. ఒకప్పటి చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ఆ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నారు. ఓ మంచి సక్సెస్ కోసం... మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో వినాయక్ కూడా ఒకరు.