తెలుగు, తమిళ భాషల్లో పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి… సంచలన విజయాలను అందుకుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరో మెగా బడ్జెట్ మూవీలో నటిస్తోంది. అదే… `భారతీయుడు 2`. లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందించిన `భారతీయుడు` (1996)కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హీరోయిన్‌గా నటించే బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది కాజల్. అంతేకాదు… ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుందట. పాత్ర రీత్యా… పడుచు అమ్మాయిగానూ, వయసు మళ్ళిన స్త్రీగానూ కాజల్ కనిపించనుందట. `వయసు మళ్ళిన స్త్రీ` గెటప్ కోసం ప్రొస్థెటిక్ మేకప్ తో దర్శనమివ్వనుందట. ఈ నేపథ్యంలో… త్వరలోనే కాజల్ యూఎస్ వెళ్ళి లుక్ టెస్ట్ లో పాల్గొనుందని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ నేతృత్వంలో ఈ లుక్ టెస్ట్ జరుగుతుందట. మొత్తమ్మీద… త్వరలోనే కాజల్‌ను ఓ వైవిధ్యభరితమైన పాత్రలో చూడబోతున్నామన్నమాట. ఫిబ్రవరి నుంచి `భారతీయుడు 2`కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: