సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పడానికి ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ నిలిచాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం విలన్ పాత్రలోనే కాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నీ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తెలుగు, తమిళం,మలయాళం, హిందీ భాషలలో నటిస్తున్నాడు జగ్గూభాయ్. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ జీవిత నేపథ్యంలో మహీ వి రాఘవ తెరకెక్కిస్తున్న యాత్ర సినిమాలో కూడా నటిస్తున్నాడు. వైఎస్ఆర్ తండ్రిరాజా రెడ్డి పాత్రని జగపతి బాబు చేస్తున్నాడు. ఇక ఇటీవలే జగపతిబాబు లుక్ ను విడుదల చేయగా… ఇందులో జగపతి బాబు లుక్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి జగపతిబాబు రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. అరవింద సమేత సినిమాలో జగపతిబాబు రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్ అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. అరవింద సమేత సినిమా తరువాత మరోసారి యాత్రలో జగపతిబాబు రాయలసీమ యాసలో మెప్పించనున్నారన్నమాట.
కాగా మహీ వి రాఘవ తెరకెక్కిస్తున్న యాత్ర సినిమాలో లెజండరీ నటుడు మమ్ముట్టి.. వైఎస్ఆర్ పాత్రలో కనిపించనున్నారు. రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది.
[youtube_video videoid=x0H7OpL3afE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: