స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విజువల్ వండర్ 2.0. భారతీయ సినిమా చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా రూ.550 కోట్ల బడ్జెట్‌తో త్రీడీ టెక్నాలజీతో రూపొందింది 2.0 సినిమా. మరి నవంబర్ 29వ తేదీన రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్లు సాధించింది. 2.0 క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి… ఈ చిత్రం రిలీజ్ ముందు హడావిడి చేసినా తరువాత ఆశించిన స్ధాయిలో కలెక్షన్స్ రాలేదు కానీ ఆతరువాత మాత్రం పుంజుకొని భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంది. అయితే హిందీ లో ఈ సినిమా మంచి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళం లో ఈసినిమాను రూ.100 కోట్లకు పైగా అమ్మారు. థియేట్రికల్ రన్ ముగిసేసరికి 60 కోట్లు మాత్రమే వసూల్ చేయగలిగింది.
తమిళంలో తో పోల్చుకుంటే తెలుగులో పర్లేదని చెప్పొచ్చు. తెలుగు లో దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్ కలిసి కొన్నారు. 72 కోట్ల బిజినెస్ తో వెళితే 55కోట్లు రాబట్టింది.
అయితే హిందీ లో మాత్రం ‘2.0’ బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చింది. అక్కడ కరణ్ జోహార్ ఈమూవీ ను రూ.100 కోట్లకు కొంటె ఇప్పుడు దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసిపెట్టింది.
[youtube_video videoid=NcXX4-rFaLk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: