విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పౌరాణిక చిత్రం ‘సీతారామ కళ్యాణం’. ఈ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన యన్టీఆర్… తన దర్శకత్వ ప్రతిభతో తొలి చిత్రంతోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు. యన్.ఏ.టి పతాకంపై యన్టీఆర్ సోదరుడు యన్. త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమాకు యన్టీఆర్ దర్శకత్వం వహించడంతో పాటు… రావణాసురుడి పాత్రలో నటించడం కూడా జరిగింది. యన్టీఆర్‌కు జంటగా బి.సరోజాదేవి నటించగా… హరనాథ్, గీతాంజలి, శోభన్‌బాబు, నాగయ్య, కాంతారావు, గుమ్మడి ముఖ్యపాత్రల్లో కనిపించారు. గాలి పెంచల నరసింహారావు సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ జనాదరణ పొందాయి. ముఖ్యంగా ‘కళ్యాణము చూతము రారండి’ అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలాగే… ‘కానరార కైలాస నివాస’ పాట కూడా శివాలయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. జనవరి 6, 1961న విడుదలైన ఈ చిత్రం… నేటితో 58 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సీతారామ కళ్యాణం’ – కొన్ని విశేషాలు:
* పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు పాత్రలకి చిరునామాగా నిలచిన యన్టీఆర్… ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో దర్శనమిచ్చారు. అంతేకాదు… ఓ ప్రతినాయకుడి పాత్రకు కథానాయకుడి స్థాయి హోదాని కల్పించారు.
* దర్శకుడిగా ఇది తొలి చిత్రమే అయినా… యన్టీఆర్ పేరు మాత్రం టైటిల్ కార్డ్స్‌లో కనిపించదు.
* రాముడి పాత్రలో హరనాథ్ కనిపించగా… సీతాదేవి పాత్రలో గీతాంజలి నటించింది. ఆమెకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
* ఈ చిత్రంతోనే `ట్రిక్ ఫొటోగ్రఫీ స్పెషలిస్ట్` అయిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ సినిమాటోగ్రాఫర్‌గా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు.
* సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావుకు ఈ సినిమా తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్. అంతేకాదు.. కెరీర్‌లో ఆఖరి చిత్రం కూడా.
* యన్టీఆర్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలు సంక్రాంతి కానుకగానే విడుదల కాగా… ఆ పండగ సమయంలోనే విడుదలైన `సీతారామ కళ్యాణం`… చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయింది.
[youtube_video videoid=LmLXpvRaJT0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: