
ట్యాగ్ · 19 కథనాలు


మోసగాళ్లకు మోసగాడు ట్రైలర్ రిలీజ్

తండ్రిని గుర్తుచేసుకుంటూ మంజుల ఎమోషనల్

సరికొత్త టెక్నాలజీ 8Kతో సింహాసనం

సూపర్ స్టార్ కృష్ణ కు మహేష్ బాబు బర్త్ డే విషెస్

'బప్పీ లహరి' బాణీ ప్రత్యేకమైనది..!

నువ్వు ఎప్పటికీ నా అన్నయ్యవే.. మహేష్ ఎమోషనల్..!

అత్యంత ఆప్తుడిని కోల్పోయా..!

సూపర్ స్టార్ కృష్ణ రిటైర్ మెంట్
50 వసంతాల "కౌబాయ్"
మామతో అల్లుడు - ఫ్యాన్ బాయ్ మూమెంట్
సౌత్ ఇండియన్ ఫస్ట్ సినిమాస్కోప్ మూవీ

సూపర్ స్టార్ కృష్ణ ‘డియర్ బ్రదర్’కి 25 ఏళ్ళు

సూపర్ స్టార్ కృష్ణ `కిరాయి కోటిగాడు`కి 37 ఏళ్ళు

తండ్రి గురించి మహేష్ ఎమోషనల్ లెటర్
అలనాటి అందాల నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే కృష్ణ అని మారుపేరు. అందుకే తన కేరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇక నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసందర్భంగా మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ లెటర్ ను షేర్ చేశారు.

మోసగాళ్లకు మోసగాడు ట్రైలర్ రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ తన సినీ చరిత్రలో చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాలు చేయడం అంటే ఆయనకు ఇష్టం. ఆ ఇష్టం వల్లే ఎన్నో క్లాసిక్ సినిమాలను మనకు అందించగలిగారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మోసగాళ్లకు మోసగాడు సినిమా గురించి. మోసగాళ్లకు మోసగాళ్లు సినిమాకు ముందు కౌబాయ్ తరహా పాత్రలు రాలేదు. తెలుగు సినీ చరిత్రలో వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈక్లాసిక్ ను కూడా రీ రిలీజ్ చేయనున్నారు. మే 31వ తేదీన ఈసినిమా రీ రిలీజ్ అవుతుంది. ఈసినిమాను 4కే వెర్షన్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను తాజాగా…

తండ్రిని గుర్తుచేసుకుంటూ మంజుల ఎమోషనల్
సూపర్ స్టార్ మహేష్ కుటుంబానికి ఈ ఏడాది మాత్రం ఎంతో విషాదాన్ని మిగిల్చిన ఏడాది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు. ముందు మహేష్ సోదరుడు రమేష్ బాబు ఆ తరువాత తల్లి పద్మావతి మరణించగా ఆ బాధ నుండి తేరుకోకముందే రీసెంట్ సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. గత కొద్దిరోజుల క్రితమే కృష్ణకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఇప్పుడిప్పుడే కుటుంబసభ్యులు ఆ బాధ నుండి తేరుకుంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తండ్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా కూతురు మంజుల కూడా…

కృష్ణా నదిలో హీరో కృష్ణ అస్థికలు నిమజ్జనం చేసిన మహేష్ బాబు
హీరో, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (79 ) కార్డియాక్ అరెస్టుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. హీరో కృష్ణ మరణంతో అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. హీరో కృష్ణ అంత్యక్రియలు మహా ప్రస్థానం లో జరిగిన విషయం తెలిసిందే.

సరికొత్త టెక్నాలజీ 8Kతో సింహాసనం
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా భారీ బడ్జెట్ , తారాగణం తో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన సింహాసనం మూవీ కి భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణ దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన సింహాసనం మూవీ లో జయప్రద , రాధ, మందాకినీ కథానాయికలు. సంగీత దర్శకుడు బప్పి లాహిరి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తెరకెక్కిన ఫస్ట్ 70ఎం ఎం తెలుగు మూవీ గా సింహాసనం రికార్డ్ క్రియేట్ చేసింది.

సూపర్ స్టార్ కృష్ణ కు మహేష్ బాబు బర్త్ డే విషెస్
సక్సెస్ ఫుల్ "తేనె మనసులు "(1965)మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అశేష అభిమానులను స్వంతం చేసుకున్నారు. నటుడు , నిర్మాత , దర్శకుడు , స్టూడియో అధినేత గా కళామతల్లి కి సేవలందించిన కృష్ణ టాలీవుడ్ లో ఫస్ట్ సూపర్ స్టార్ గా నిలిచారు. సుమారు 350 చిత్రాలలో నటించిన కృష్ణ 1965 నుండి 1995 వరకూ సంవత్సరానికి 10 సినిమాలలో నటించిన ఏకైక హీరోగా సూపర్ స్టార్ కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు.

'బప్పీ లహరి' బాణీ ప్రత్యేకమైనది..!
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు నేడు తుది శ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స తీసుకుంటూ ఆయన మృతి చెందారు. రేపు ఆయన అంత్యక్రియలు జరిపించనున్నారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ నుండి పలువురు సినీ ప్రముఖులు బప్పి లహరి మరణంపై సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియచేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు ఇలా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

బప్పి లహరి బెస్ట్ తెలుగు సాంగ్స్
బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి సూపర్ హిట్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ "సింహాసనం "మూవీ తో బప్పి లహరి సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో "ఆకాశంలో ఒక తార "సాంగ్ హైలైట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి "స్టేట్ రౌడీ ", "గ్యాంగ్ లీడర్ ", "రౌడీ అల్లుడు " చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన బప్పి లహరి అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నువ్వు ఎప్పటికీ నా అన్నయ్యవే.. మహేష్ ఎమోషనల్..!
సినీ పరిశ్రమకు ఒక దాని తర్వాత మరో దెబ్బ తగులుతూనే ఉంది. గత రెండేళ్లలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను సినీ పరిశ్రమ కోల్పోయింది. కరోనా వల్ల ఎంతో మంది లెజెండరీలను కోల్పోవాల్సి వచ్చింది. కొంతమంది అకాల మరణం చెందారు. ఇక ప్రస్తుతం కరోనా వల్ల రోజుకో సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణించిన వార్త ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రమేష్ బాబు. అది కాస్త సీరియస్ అవ్వగా ఆస్పత్రికి తరలించే క్రమంలో తుదిశ్వాస విడిచారు. ఇక రమేష్ బాబు మరణంతో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ…

అత్యంత ఆప్తుడిని కోల్పోయా..!
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి నేడు కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు పి.సి.రెడ్డికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక పి.చంద్రశేఖర్ రెడ్డి మృతిపట్ల సూపర్ స్టార్ కృష్ణ స్పందించి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియచేశారు.

తెలుగు ప్రేక్షకుల ఆల్ టైమ్ ఫేవరెట్ 'అల్లూరి సీతారామరాజు'
తెలుగు సినీ ప్రేక్షక్షులకు అల్లూరి సీతారామరాజు అంటే మొదట గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో ప్రయోగాత్మక సినిమాలు చేయాలంటే ముందుకొచ్చే హీరో ఎవరైనా ఉన్నారంటే కృష్ణా తరువాతే ఎవరైనా అన్న విషయం తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో ఆయన చేసిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటిగా అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కృష్ణ తప్పా ఆ పాత్రను అలా ఎవరూ చేయలేరు అన్నట్టు.. అల్లూరి బ్రతికి ఉంటే ఇలానే ఉంటాడా అనే రీతీలో కృష్ణ నటించారు.

సూపర్ స్టార్ కృష్ణ రిటైర్ మెంట్
"తేనె మనసులు"(1965 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుమారు 350 సినిమాలలో నటించిన కృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారు. విశేష అభిమానులు ఉన్న హీరో కృష్ణ ఫస్ట్ కలర్ ఫిల్మ్ , ఫస్ట్ 70 ఎమ్ ఎమ్ వంటి పలు నూతన అధ్యాయాలకు ఆద్యుడు ఆయ్యారు. నటుడు , నిర్మాత , దర్శకుడిగా ఐదు దశాబ్దాలుగా కళామతల్లి కి సేవలందించిన హీరో కృష్ణ ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
50 వసంతాల "కౌబాయ్"
పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ , విజయ నిర్మల జంటగా ఇంగ్లీష్ మూవీస్ ఇన్ స్పి రేషన్ తో రూపొందిన "మోసగాళ్ళకు మోసగాడు "మూవీ 1971 సంవత్సరం ఆగష్టు 27 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది . తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ కౌ బాయ్ మూవీ , ఫస్ట్ కలర్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగభూషణం , గుమ్మడి , కైకాల , ప్రభాకరరెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. పి. ఆదినారాయణ రావు సంగీతం అందించారు. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్స్ ఇంగ్లిష్ , హిందీ , తమిళ భాషలలో రిలీజ్ అయ్యాయి.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాహసాలకు మారు పేరు కృష్ణ. ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే ఆయన తరువాతే. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాజ్యమేలుతున్న వేళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన మార్గం నిర్దేశించుకున్నారు. ఒకరు జానపదం మరొకరు పౌరాణికాలకు పెట్టింది పేరుగా ముందుకు సాగుతున్న వేళ.. సాంఘిక చిత్రాలకు కేరాఫ్ గా మారారు కృష్ణ. అందులోనూ విత్ యాక్షన్ అంటే.. నిర్మాతలు దర్శకులకు ప్రముఖంగా సూపర్ స్టార్ కనిపించేవారు. తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి…
మామతో అల్లుడు - ఫ్యాన్ బాయ్ మూమెంట్
ఎంత హీరోలు అయినా కూడా వాళ్లకి కూడా ఎవరో ఒకరు ఫెవరెట్ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సుధీర్ బాబు. అసలు సంగతేంటంటే.. ఈరోజు తన ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్ట్ చేశాడు. కృష్ణ అక్కడ కుర్చీపై కూర్చుంటే.. కింద సుధీర్ బాబు సిగ్గు పడుతూ కూర్చున్నాడు. దానికి సుధీర్ బాబు.. చాలా ఏళ్లుగా ఆయన్ని దగ్గరిగా చూస్తున్నా.. అయితే ఆయనతో ఉన్న ప్రతిక్షణం ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లా అనిపిస్తుంటుంది అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సౌత్ ఇండియన్ ఫస్ట్ సినిమాస్కోప్ మూవీ
పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై వి. రామచంద్ర రావు దర్శకత్వంలో హీరో కృష్ణ కథానాయకుడిగా బ్రిటిష్ సామ్రాజ్యం పై పోరాటం జరిపిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ "అల్లూరి సీతారామరాజు " 1974 సంవత్సరం మే 1 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. విజయ నిర్మల , జగ్గయ్య , చంద్ర మోహన్ , కాంతారావు , బాలయ్య , ప్రభాకర్ రెడ్డి ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి పి. ఆదినారాయణ రావు సంగీతం అందించారు.

సూపర్ స్టార్ కృష్ణ ‘డియర్ బ్రదర్’కి 25 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు మాస్ ఎంటర్‌టైనర్స్ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘డియర్ బ్రదర్’ ఒకటి. టి.ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణకి జోడిగా గౌతమి నటించింది. రఘువరన్, ‘మహర్షి’ రాఘవ, యమున, డిస్కో శాంతి, బ్రహ్మానందం, అలీ, బాబుమోహన్, సారథి ముఖ్య పాత్రలు పోషించగా సురభి ప్రత్యేక గీతంలో మెరిసింది.

సూపర్ స్టార్ కృష్ణ తొలి చిత్రం ‘తేనెమనసులు’కు 55 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగునాట పలు ప్రయోగాలకు చిరునామాగా నిలచిన లెజెండరీ యాక్టర్. అలాంటి కృష్ణ వెండితెరపై తొలిసారి వెలుగులు పంచిన చిత్రం `తేనెమనసులు`.

సూపర్ స్టార్ కృష్ణ `కిరాయి కోటిగాడు`కి 37 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో `కిరాయి కోటిగాడు` ఒకటి. మ్యూజికల్ హిట్ గా నిలచిన ఈ మాస్ ఎంటర్ టైనర్ ని ఎ.కోదండరామి రెడ్డి డైరెక్ట్ చేయగా.. రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై యన్. రామలింగేశ్వరరావు నిర్మించారు. రావుగోపాల రావు, అల్లు రామలింగయ్య, శ్రీధర్, ముచ్చర్ల అరుణ తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.