ఎంత హీరోలు అయినా కూడా వాళ్లకి కూడా ఎవరో ఒకరు ఫెవరెట్ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సుధీర్ బాబు. అసలు సంగతేంటంటే.. ఈరోజు తన ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్ట్ చేశాడు. కృష్ణ అక్కడ కుర్చీపై కూర్చుంటే.. కింద సుధీర్ బాబు సిగ్గు పడుతూ కూర్చున్నాడు. దానికి సుధీర్ బాబు.. చాలా ఏళ్లుగా ఆయన్ని దగ్గరిగా చూస్తున్నా.. అయితే ఆయనతో ఉన్న ప్రతిక్షణం ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లా అనిపిస్తుంటుంది అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సుధీర్ బాబు కృష్ణ చిన్న కూతురు, మహేష్ బాబు చెల్లి ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లకు ఇద్దరు అబ్బాయిలున్నారు. సూపర్ స్టార్ అల్లుడు అయినా కూడా సొంతంగానే ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టపడి ఈ రేంజ్ కి వచ్చాడు. ఎస్ఎమ్ఎస్ సినిమాతో హీరోగా మారిన సుధీర్ బాబు ఒక్కోమెట్టు ఎక్కుతూ మంచి పేరు సంపాదించుకున్నాడు.
It’s been years watching him so close …. Yet every minute with him is a fan boy moment ❤️ #MySUPERSTAR #Diwali2020 pic.twitter.com/ckEhwc2gg0
— Sudheer Babu (@isudheerbabu) November 18, 2020
ఇదిలా ఉండగా ప్రస్తుతం సుధీర్ బాబు.. కరుణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ లో అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: