సూపర్ స్టార్ కృష్ణ తన సినీ చరిత్రలో చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాలు చేయడం అంటే ఆయనకు ఇష్టం. ఆ ఇష్టం వల్లే ఎన్నో క్లాసిక్ సినిమాలను మనకు అందించగలిగారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మోసగాళ్లకు మోసగాడు సినిమా గురించి. మోసగాళ్లకు మోసగాళ్లు సినిమాకు ముందు కౌబాయ్ తరహా పాత్రలు రాలేదు. తెలుగు సినీ చరిత్రలో వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈక్లాసిక్ ను కూడా రీ రిలీజ్ చేయనున్నారు. మే 31వ తేదీన ఈసినిమా రీ రిలీజ్ అవుతుంది. ఈసినిమాను 4కే వెర్షన్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగానే ఈట్రైలర్ ను రిలీజ్ చేయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: