సూపర్ స్టార్ మహేష్ కుటుంబానికి ఈ ఏడాది మాత్రం ఎంతో విషాదాన్ని మిగిల్చిన ఏడాది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు. ముందు మహేష్ సోదరుడు రమేష్ బాబు ఆ తరువాత తల్లి పద్మావతి మరణించగా ఆ బాధ నుండి తేరుకోకముందే రీసెంట్ సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. గత కొద్దిరోజుల క్రితమే కృష్ణకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఇప్పుడిప్పుడే కుటుంబసభ్యులు ఆ బాధ నుండి తేరుకుంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తండ్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా కూతురు మంజుల కూడా తండ్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. సరిగ్గా నేలరోజుల క్రితం.. నా పుట్టినరోజు నాడు.. నువ్వు లేకుండా ప్రతి రోజు చాలా కష్టంగా ఉంది నాన్న.. కానీ నా పుట్టినరోజు నువ్వు నాతో ఉన్నావు.. ఈ పుట్టినరోజు ఎప్పటికీ గుర్తిండిపోతుంది అంటూ తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
This was exactly 1 month back, on my birthday.
Every day without you has been hard Nana, but on this day especially I can’t help but think how much I wish you were with me. I will cherish this Birthday all my life ❤️❤️❤️ pic.twitter.com/2lTMdWBGw2
— Manjula Ghattamaneni (@ManjulaOfficial) December 8, 2022
కాగా తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఆ రోజుల్లోనే టెక్నాలజీని పరిచయం చేసిన ఏకైక హీరో కృష్ణ. మొదటగా పలు నాటకల్లో నటించిన ఆయన ఆ తరువాత పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక తేనెమనసులు సినిమాతో నటుడిగా అందరి ప్రశంసలందుకున్నారు కృష్ణ. తొలి చిత్రం సాధించిన విజయంతో కృష్ణ వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఇక తన సినీ ప్రయాణంలో 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























