సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాహసాలకు మారు పేరు కృష్ణ. ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే ఆయన తరువాతే. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాజ్యమేలుతున్న వేళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన మార్గం నిర్దేశించుకున్నారు. ఒకరు జానపదం మరొకరు పౌరాణికాలకు పెట్టింది పేరుగా ముందుకు సాగుతున్న వేళ.. సాంఘిక చిత్రాలకు కేరాఫ్ గా మారారు కృష్ణ. అందులోనూ విత్ యాక్షన్ అంటే.. నిర్మాతలు దర్శకులకు ప్రముఖంగా సూపర్ స్టార్ కనిపించేవారు. తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి 70 ఎమ్‌ఎమ్ సినిమా… `మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్‌ని పరిచయం చేశారు. ఇంకా జేమ్స్ బాండ్ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు సూపర్ స్టార్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయన సినీ ప్రముఖుల నుండి బర్త్ డే విషెస్ అందాయి. ఈనేపథ్యంలోనే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియాఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటమని కోరారు. ఆయన ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు నానక్ రామ్‌గూడలోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సందర్భంగా హీరో కృష్ణ మాట్లాడుతూ ‘‘పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. అతను చేస్తున్న కృషికి నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాను’’ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: