సక్సెస్ ఫుల్ “తేనె మనసులు “(1965)మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అశేష అభిమానులను స్వంతం చేసుకున్నారు. నటుడు , నిర్మాత , దర్శకుడు , స్టూడియో అధినేత గా కళామతల్లి కి సేవలందించిన కృష్ణ టాలీవుడ్ లో ఫస్ట్ సూపర్ స్టార్ గా నిలిచారు. సుమారు 350 చిత్రాలలో నటించిన కృష్ణ 1965 నుండి 1995 వరకూ సంవత్సరానికి 10 సినిమాలలో నటించిన ఏకైక హీరోగా సూపర్ స్టార్ కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే (మే 31 ) సందర్భంగా సినీప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తుతున్నాయి. తాజాగా కృష్ణ తనయుడు మహేష్ బాబు తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు హ్యాపీ బర్త్ డే నాన్న, ఈ ప్రపంచంలో మీలా మరొకరు ఉండరనీ , మీరు ఎన్నో ఏళ్ళు ఇలా ఆనందంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనీ , ఆ భగవంతుని ఆశీసులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాననీ , లవ్ యు అంటూ మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: