ట్యాగ్ · 286 కథనాలు · పేజీ 14

పుష్ప లో మరో విలన్..?
రెండు భాగాలుగా "పుష్ప" ?
అల్లు అర్జున్ సింపుల్ &స్వీట్ - రష్మిక

"రంగస్థలం "మూవీ తమిళ ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ తో సినిమా ఆగిపోలేదు

"రంగస్థలం " తమిళ వెర్షన్ రిలీజ్ డేట్
'పుష్ప' బర్త్ డే పోస్టర్ రిలీజ్

మాస్ కా బాప్ అనిపిస్తున్న 'పుష్ప రాజ్'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

'పుష్ప రాజ్' కు టైమ్ ఫిక్స్

పుష్ప 'లోడ్ దింపతాండం'

రామ్‌తో 'జగడం' రీమేక్ చేయాలని ఉంది
అఫీషియల్.. కార్తికేయతో సుకుమార్ సినిమా

'పుష్ప' సెట్ లో జానీ సందడి

ఒకేచోట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్
స్కూల్ కట్టిస్తున్న క్రియేటివ్ డైరెక్టర్..!

బన్నీ - సుకుమార్ సినిమా టైటిల్ గా 'పుష్ప'...?
'పుష్ప' పార్ట్ 2 లో అండర్ వరల్డ్ డాన్ గా..!
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్ తోనే ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పుష్ప సినిమా గురించి మాత్రం రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. అందులోనూ ఈసినిమాను రెండు భాగాలుగా తీసుకురానున్నారు అని తెలిసిన దగ్గర నుండి ఈవార్తలు మరింత ఎక్కువయ్యాయి.

పుష్ప లో మరో విలన్..?
పుష్ప సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఈసినిమాకు ఉన్న క్రేజ్ అలాంటింది. ఇక ఈమధ్యకాలంలో ఈసినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించాలని చూస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.. అది కూడా కన్ఫామ్ అయినట్టు కూడా తేలిపోయింది. ప్రస్తుతం సుక్కూ అండ్ టీమ్ రెండు భాగాలుగా చేసిన స్క్రిప్ట్ లో మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ముందుగా రాసుకున్న కథకు ఇప్పుడు అదనంగా కొత్త కంటెంట్ ని యాడ్ చేస్తున్నారు. దీనిలోభాగంగానే 30-35 నిమిషాలకు పైగా నిడివిని పెంచాల్సి ఉంటుంది.

డిఫరెంట్ టైటిల్స్- పార్ట్ 1 కు 'పుష్ప'..పార్ట్ 2కి..?
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా పుష్ప.. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ సినిమా కూడా పుష్పనే. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు సుకుమార్. ఇక ఈసినిమాకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా కోసం మెగా అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికి తోడు బన్నీ బర్త్ డే కు రిలీజ్ చేసిన టీజర్ ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1.5 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోవడంతోపాటు.. 65 మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది.
రెండు భాగాలుగా "పుష్ప" ?
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పుష్పరాజ్ సరికొత్త రికార్డ్.. ఇంట్రడక్షన్ @50 మిలియన్స్
తగ్గేదే లే.. ఇది పుష్ప సినిమాలో బన్నీ చెప్పే డైలాగ్. ఇక అలాగే బన్నీ కూడా నిజంగానే తగ్గేలా కనిపించడంలేదు. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ లుక్, టీజర్ ఇలా అన్నీ ఆకట్టుకోవడం, బన్నీ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అసలే ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి... ఈఒక్క టీజర్ తో ఆ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లారు. ఇక బన్నీకి రికార్డులు కొత్తేమీకాదు. అలవైకుంఠపురములో పాటలు అయితే ఏడాది అవుతున్నా ఇప్పటికీ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ఇక పుష్ప ఫస్ట్ లుక్ తోనే…
అల్లు అర్జున్ సింపుల్ &స్వీట్ - రష్మిక
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఫాహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

"రంగస్థలం "మూవీ తమిళ ట్రైలర్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా”రంగస్థలం “మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు , అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

విజయ్ దేవరకొండ తో సినిమా ఆగిపోలేదు
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కూడా మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా సుకుమార్ అండ్ టీమ్.. ‘పుష్ప’ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడనే విషయమై క్లారిటీ ఇచ్చారు. పుష్ప తర్వాత సుకుమార్.. తన తర్వాతి సినిమాను రామ్ చరణ్‌తో చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా మాత్రం పూర్తి స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు.

"రంగస్థలం " తమిళ వెర్షన్ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా"రంగస్థలం "మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు , అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
'పుష్ప' బర్త్ డే పోస్టర్ రిలీజ్
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పుష్ప. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ రోజు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని నిన్ననే విడుదల చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్‌తో పాటు.. యాక్షన్.. బ్యాక్‌గ్రాండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ టీజర్ య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

మాస్ కా బాప్ అనిపిస్తున్న 'పుష్ప రాజ్'
తగ్గేదేలే.. బన్నీ పుష్ప సినిమాలో వాడే ఊత పదం అని ఇప్పటికే చెప్పారు.. ఇక బన్నీ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ఈ ఒక్క పదం మాత్రమే చూపించారు.. మరి టీజర్ చూసిన తరువాత నిజంగానే బన్నీ తగ్గేలా కనిపించడం లేదు. ఏదో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర.. మేకోవర్ ఛేంజ్ చేశాడు కొత్తగా ఉంటుందేమో అనుకున్నారు కానీ టీజర్ చూసిన తరువాత బన్నీ మరో బ్లాక్ బస్టర్ కు రెడీ అవుతున్నాడు అన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
మ్యూజికల్ హిట్ "గంగోత్రి " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఇంప్రెసివ్ యాక్టింగ్ , డ్యాన్సింగ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక.

'పుష్ప రాజ్' కు టైమ్ ఫిక్స్
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'పుష్ప'. శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం, టెన్ కాశీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. తర్వాతి షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

పుష్ప 'లోడ్ దింపతాండం'
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వస్తున్న సినిమా పుష్ప. పుష్ప రాజ్ అనే డ్రైవర్ పాత్రలో ఫుల్ మాస్ అండ్ రస్టిక్ లుక్ లో బన్నీ ఈసారి బాక్సాఫీస్ వద్ద దాడి చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బన్నీ లుక్ ను చూసే సినిమాపై ఓరేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

రామ్‌తో 'జగడం' రీమేక్ చేయాలని ఉంది
కొన్ని సినిమాలు హిట్ కాకపోవచ్చేమో కానీ వాటికి మాత్రం స్పెషల్ గా గుర్తింపు ఉంటుంది. ఆ లిస్ట్ లో సుకుమార్ సినిమా జగడం కూడా ఉంటుంది. సుకుమార్ ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ తరువాత, రామ్ దేవదాస్ బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వచ్చిన సినిమా జగడం. ఇద్దరికీ ఈసినిమా నిరాశనే మిగిల్చినా కూడా మంచి కల్ట్ మూవీ అని ఇప్పటికీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తారు. ఈ సినిమా నచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఈ చిత్రం విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుకుమార్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలుచెప్పాడు. ఎంతో ప్రేమతో తాను జగడం సినిమా తీసినట్లు గుర్తు చేసుకున్నాడు.
అఫీషియల్.. కార్తికేయతో సుకుమార్ సినిమా
మొత్తానికి సుకుమార్ అటు డైరెక్షన్ తో పాటు ఇటు నిర్మాణ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా యంగ్ స్టార్ట్ తో సినిమాలు నిర్మిస్తున్నాడు. మొదట రాజ్ తరుణ్ తో కుమారి 21ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సుకుమార్.. ఇటీవల ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో యంగ్ హీరోతో సినిమాను లైన్ లో పెట్టాడు. అంతేకాదు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.

'పుష్ప' సెట్ లో జానీ సందడి
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 'పుష్ప' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరంలలో రెండు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న పుష్ప టీం ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ ను జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఒకేచోట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్
టాలీవుడ్ స్టార్ దర్శకులంతా ఒకే చోట కలిసి ఉండటం.. చిన్న పార్టీ చేసుకొని అందరూ కలిసీ తినడం చాలా అరుదుగా జరిగే విషయాలు. ఎప్పుడో ఏదైనా విషయం ఉంటే తప్పా కలుసుకునే అవకాశం ఉండదు. దానికి తోడు ఇప్పుడు కరోనా. కరోనా వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగిందో తెలియదు కానీ... సినీ పరిశ్రమకు మాత్రం చాలా నష్టమే కలిగింది. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపపడ్డాయి. ఒక పక్క సినీ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఒకరి నొకరు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. గత ఆరు నెలలుగా ఇళ్లకే పరిమితమవ్వగా.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
స్కూల్ కట్టిస్తున్న క్రియేటివ్ డైరెక్టర్..!
సినిమాలే కాదు సేవా కార్యక్రమాలు చేయడంలోనూ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి పలు సందర్భాల్లో ఇప్పటికే చూశాం. ఇక ఇప్పటికే ఎంతో మంది తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కొంతమంది చేసినవి బయటకొస్తే కొంతమంది చేసిన పనులు బయటకు రావు. ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒక స్కూల్ కట్టిస్తున్నారట.

బన్నీ - సుకుమార్ సినిమా టైటిల్ గా 'పుష్ప'...?
బన్నీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా విదితమే. మరి స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందంటే.. ఇక ఆ సినిమాకు సంబంధించిన పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి కదా. అలానే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా ఇప్పటికే పలు పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో ఈ సినిమాకు 'శేషాచలం' అన్న టైటిల్ అనుకుంటున్నట్టు రూమర్లు వచ్చాయి. అయితే ఆ రూమర్లను అప్పుడే కొట్టిపడేసింది చిత్రయూనిట్.