సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరంలలో రెండు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న పుష్ప టీం ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ ను జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా..ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవలె జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. దీనికి సంబంధించి షూటింగ్ స్పాట్ ఫోటోలను జానీ మాస్టర్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అల్లు అర్జున్, సుకుమార్‌లతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నా్డు. కాగా గతంలోనూ అల్లు అర్జున్- జానీ మాస్టర్ కాంబినేషన్‌లో వచ్చిన పాటలు బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Loving to work with @alluarjun garu @aryasukku garu & entire team of #Pushpa 😍
DOP #MiroslawKubaBrozek Garu is too friendly to work with 😇@MythriOfficial pic.twitter.com/0OnxO5Whli
— Jani Master (@AlwaysJani) February 26, 2021
కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: