
ట్యాగ్ · 286 కథనాలు · పేజీ 15

బన్నీ, సుక్కు... ఓ రెండక్షరాల టైటిల్

దసరా బరిలో అల్లు అర్జున్ - సుకుమార్ చిత్రం?

మరోసారి రామ్, సుకుమార్ కాంబినేషన్?
`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `రెడ్`. తమిళ సినిమా `తడమ్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. `నేను శైలజ`, `ఉన్నది ఒక్కటే జిందగీ` అనంతరం రామ్, కిషోర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రం తరువాత మారుతి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని చేసేందుకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా రామ్ ఖాతాలో చేరనుందట.
`బాహుబలి - ది కంక్లూజన్` విడుదల తేదికి అల్లు అర్జున్ చిత్రం?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి రావడమే కాకుండా, కెరీర్ బెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అలాగే వసూళ్ళ పరంగా `నాన్ - బాహుబలి` రికార్డు అందుకున్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా `బాహుబలి - ది కంక్లూజన్` రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసుకున్నాడట.
బన్నీ, సుక్కు... ఓ రెండక్షరాల టైటిల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘ఆర్య’తో తెలుగునాట దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్. అంతేకాదు... మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు కూడా. అనంతరం బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘ఆర్య 2’తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేశాడు. కట్ చేస్తే... పదేళ్ళ విరామం అనంతరం ముచ్చటగా మూడోసారి తన లక్కీ హీరో కాంబోలో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధపడుతున్న సుక్కు... ఈసారి కూడా తన గత సినిమాల సెంటిమెంట్‌నే కంటిన్యూ చేయనున్నట్టు సమాచారం.

బన్నీ - సుక్కు మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అప్‌డేట్ ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి అచ్చొచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం 'ఆర్య`.. బన్నీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌లా నిలవగా, మలి చిత్రం 'ఆర్య 2' మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే... పదేళ్ళ తరువాత ఈ ఇద్దరూ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారిప్పుడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రధానంగా చిత్తూరు నేపథ్యంలో సాగుతుందట. బన్నీ కూడా చిత్తూరు యాసతో సరికొత్త లుక్‌లో సందడి చేస్తాడని టాక్. అంతేకాదు... ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బన్నీ తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

దసరా బరిలో అల్లు అర్జున్ - సుకుమార్ చిత్రం?
`అల వైకుంఠపురములో` చిత్ర ఘనవిజయం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకవైపు ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు కొత్త చిత్రంపై దృష్టి సారించాడు బన్నీ. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. కాగా, నెక్స్ట్ షెడ్యూల్ ని మరో పది రోజుల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేరళలో 40 రోజుల పాటు నిరవధికంగా జరిగే ఈ భారీ షెడ్యూల్ లో సింహభాగం చిత్రీకరణని పూర్తి చేయనున్నారని సమాచారం. అంతేకాదు.. విజయదశమి బరిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు…

#Chiru 153 మూవీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న సుకుమార్ ?
"సైరా నరసింహా రెడ్డి" మూవీ విజయం తరువాత మెగా స్టార్ చిరంజీవి తన 152 వ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, త్రిష జంటగా సోషల్ మెసేజ్ తో చిరంజీవి 152 మూవీ రూపొందుతుంది. 152 మూవీ తరువాత #Chiru 153 మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.