తగ్గేదేలే.. బన్నీ పుష్ప సినిమాలో వాడే ఊత పదం అని ఇప్పటికే చెప్పారు.. ఇక బన్నీ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ఈ ఒక్క పదం మాత్రమే చూపించారు.. మరి టీజర్ చూసిన తరువాత నిజంగానే బన్నీ తగ్గేలా కనిపించడం లేదు. ఏదో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర.. మేకోవర్ ఛేంజ్ చేశాడు కొత్తగా ఉంటుందేమో అనుకున్నారు కానీ టీజర్ చూసిన తరువాత బన్నీ మరో బ్లాక్ బస్టర్ కు రెడీ అవుతున్నాడు అన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
1.21 నిమిషాల నిడివితో విడుదలైన ఈ టీజర్‌ని బట్టి ‘పుష్ప’ సినిమా ఏ రేంజ్ సినిమానో హింట్ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్.. అల్లు అర్జున్ లుక్ ఇదో సరికొత్త ఫార్మేట్ చిత్రం అని చెప్పకనే చెబుతుంది. కేవలం ఒక్క డైలాగ్ తో సుకుమార్ బ్రిలియంట్ డైరెక్షన్ కనిపిస్తుంది. దానికి తోడు సినిమాటోగ్రాఫర్ కూబా సినిమాటోగ్రఫి ఈసినిమాకే హైలాట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. .. అడవుల్లో విజువల్స్ అంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. దానికి దేవి శ్రీ ప్రసాద్ లాంటి డైరెక్క్షర్ బీజీయం తోడైతే ఎలా ఉంటుంది.. అలానే సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది పుష్ప టీజర్.
ఇక స్పెషల్ గా బన్నీ యాక్షన్.. ఇప్పటి వరకూ మాస్ టచ్ ను లైట్ గానే చూపించిన బన్నీ.. ఈసినిమాలో మాత్రం మాస్ కా బాప్ అనిపించాడు. వేటకొడవల్ని చేతిలో పట్టుకోవడం.. నాలుక మడతపెట్టి ఎర్రచందనం దుంగల్ని పైకి ఎగరవేయడం.. యాసలో మాట్లాడటం… పుష్పకు పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించాడు. మరి టీజరే ఈరేంజ్ లో ఉంటే సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఆసక్తి అందరిలో పెరిగిపోయింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: