డిఫరెంట్ టైటిల్స్- పార్ట్ 1 కు ‘పుష్ప’..పార్ట్ 2కి..?

Makers Of Pushpa Movie To Come Up With Two Different Titles For Two Parts,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allu Arjun's Pushpa In Two Parts,Allu Arjun,Stylish Star Allu Arjun,Actor Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Latest News,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Update,Pushpa Movie Updates,Pushpa Film Update,Pushpa Movie Latest Update,Pushpa Movie News,Pushpa movie Latest News,Allu Arjun’s Pushpa Movie,Allu Arjun’s Pushpa,Pushpa Movie To Be Released In Two Parts,Pushpa To Get Released In Two Parts,Pushpa Movie To Release In Two Parts,Allu Arjun’s Pushpa In Two Parts,Allu Arjun Latest Movie,Allu Arjun New Movie,Rashmika Mandanna,Sukumar,Pushpa Two Parts,Pushpa Part 2 Title,Title For Pushpa Part 1 and 2,Two Titles For Pushpa Two Part 1 and 2,Allu Arjun Latest News,Allu Arjun New Movie Updates,#Pushpa

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో రానున్న మూడవ సినిమా పుష్ప.. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ సినిమా కూడా పుష్పనే. ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు సుకుమార్. ఇక ఈసినిమాకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా కోసం మెగా అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికి తోడు బన్నీ బర్త్ డే కు రిలీజ్ చేసిన టీజర్ ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1.5 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోవడంతోపాటు.. 65 మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతుందని కొద్దిరోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అది కూడా దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది. ముందుగా ఈసినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేయాలనుకున్నారు…కానీ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనన్న క్లారిటీకొచ్చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే పుష్ప1 అండ్ పుష్ప2.. ఇలా సినిమాను రెండు భాగాలుగా విడగొట్టాలని సుక్కూ ప్లాన్ వేశాడట. ఇదిలాఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అది ఈసినిమా టైటిల్స్ గురించి. బాహుబలికి అయితే బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లూజన్ అని పెట్టేశారు.. అయితే పుష్ప కు డిఫరెంట్ టైటిల్స్ పెట్టాలని చూస్తున్నారట. రెండు పార్ట్ లుగా తీయనున్న నేపథ్యంలో మొదటి పార్ట్ కు మొదటి నుండి అనుకుంటున్న పుష్పనే ఫిక్స్ చేస్తారట. రెండో భాగానికి మాత్రం వేరే టైటిల్ ను పెట్టనున్నారట. మరి ఈ పార్ట్ కు ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేస్తారో..లేక పుష్ప 2 అనే ఉంచేస్తారో చూడాలి.

కాగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు సగానికిపైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఆక్టోబర్ 13న పార్ట్1 ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మిగతా పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పుష్ప మూవీలో లారీ డ్రైవర్ గా నటిస్తుండగా.. గిరిజన యువతి పాత్రలో నటిస్తుంది స్టార్ హీరోయిన్ రష్మిక. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + six =