మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా”రంగస్థలం “మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు , అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన “రంగస్థలం “మూవీ పలు అవార్డ్స్ అందుకుంది. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు గా రామ్ చరణ్ , వరలక్ష్మి గా సమంత , రంగమ్మత్త గా అనసూయ ,కుమార్ బాబు గా ఆది పినిశెట్టి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “రంగస్థలం “మూవీ అదే పేరుతో తమిళ డబ్బింగ్ వెర్షన్ తమిళనాడు లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ని ఏప్రిల్ 30 వ తేదీ భారీగా రిలీజ్ చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ సంస్థ 7జీ ఫిల్మ్స్ ప్రకటించింది. “రంగస్థలం “మూవీ తమిళ ప్రేక్షకులను అలరించనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























