కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rebel Star Prabhas

ట్యాగ్ · 331 కథనాలు · పేజీ 16

సినిమా వార్తలు

'రాధే శ్యామ్' షూట్ కోసం వెయిటింగ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేస్‌లో ముందు ఉంది పూజా హెగ్డే. అల వైకుంఠపురములో, గద్దలకొండ గణేష్, మహర్షి, అరవింద సమేత ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. దాదాపు స్టార్ హీరోలందరితో ఈ బుట్టబొమ్మ జోడీ కట్టేసింది. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఇప్పటికే మొదలైంది. పూజా హెగ్డే, అఖిల్ షూట్ లో పాల్గొంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ప్రభాస్ 21' కు మెంటర్ గా సింగీతం శ్రీనివాసరావు

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
Rebel Star Prabhas Is A Highly Committed Person Says Radhe Shyam Director Radhakrishna Kumar
సినిమా వార్తలు

ప్రభాస్ కమిట్ మెంట్ లెవల్స్ పీక్స్

'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో ఇంతకు ముందున్న ట్విట్టర్ రికార్డులను చెరిపేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ ఛాలెంజ్ పూర్తిచేసిన శ్రద్దా

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ లో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ పాల్గొని పూర్తి చేశారు. కేవలం సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాదు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ కు బ్రదర్ గా అథర్వా మురళి..?

విభిన్నమైన పాత్రలతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అథర్వా మురళి. ఈ మధ్య విడుదలైన వరుణ్‌తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో కీలక పాత్ర చేసి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తమిళ్ సినిమాల్లో చేస్తూనే తెలుగులో కూడా అవకాశాలు కొట్టేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' కోసం 'కీరవాణి'..?

ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నా కానీ 'ఆదిపురుష్‌' సినిమా పై ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ సినిమాలో కథానాయకుడు, ప్రతినాయకుడు పాత్రల్లో ఎవరు నటిస్తున్నారో ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. ఇక సీత పాత్రపై కూడా పలు హీరోయిన్స్ పేరు తెరపైకి రాగా వాటిపై కూడా చిత్ర యూనిట్ స్పందించి.. ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు.. ఫైనలైజ్ చేసి మేమే చెప్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా టాప్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ని సెట్‌ చేయాలని ఓంరౌత్‌ చూస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఎమ్‌.ఎమ్‌…

TFN Adminవాట్సాప్
Actress Pooja Hegde Gets Ready For Radhe Shyam Movie Shoot
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు రెడీ అయిపోయిన బుట్టబొమ్మ

మొత్తానికి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలు కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి షూటింగ్ లను ప్రారంభిస్తున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్యాలు అనుమతులు ఇచ్చినా కరోనాకు భయపడి షూటింగ్ లను జరపలేదు. అయితే ఇప్పట్లో కరోనాకు అంతం లేదని భావించి.. తక్కువ మంది స్టాఫ్ తో కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లను జరపడానికి రెడీ అయిపోతున్నారు. ఒక పది. పదిహేను రోజుల పెండింగ్ వున్న సినిమాలు అయితే ఇప్పటికే షూటింగ్ ను మొదలు పెట్టి మిగిలిన షూట్ ను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్స్ అందరూ చిన్నగా హైదరాబాద్ లో వాలిపోతున్నారు. దీనిలో భాగంగానే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"ఆదిపురుష్ " మూవీ అప్ డేట్

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 " మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రభాస్ కు అధిక సంఖ్య లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. స్టైలిష్ మూవీ "సాహో "బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడంతో ఉత్తరాది లో ప్రభాస్ పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ రూపొందుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ మూవీ "ఆదిపురుష్ " అనౌన్స్ అయ్యింది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఆ సినిమా అప్పుడు నేను చాలా రోజులు నిద్రపోలేదు..!

ఏదో వారసత్వం.. లక్కో.. కాలం కలిసొస్తేనో హీరోలు అయిపోరు. అలా అయినా ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండరు. కష్టపడాలి.. టాలెంట్ ఉండాలి.. సినిమా సినిమాకు వైవిధ్యత చూపించాలి. ప్యాషన్ ఉండాలి. అలా అయితేనే స్టార్ హీరోలు అవుతారు. అలాంటి హీరోలు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో ప్రభాస్ మొదటి వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ హీరో అయినా ఒక సినిమాకు 5 ఏళ్ళు కేటాయించగలడా? అంత ధైర్యం ప్రభాస్ చేసాడంటేనే చెప్పొచ్చు ప్రభాస్ డెడికేషన్ ఏంటో. కేవలం ఒక్క జోనర్ కు మాత్రమే ఫిక్స్ అవ్వకుండా అన్ని జోనర్లు ట్రై చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదిగాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సీత' పాత్రపై 'ఆదిపురుష్' టీమ్ క్లారిటీ

భారీ సినిమాపై రూమర్స్ రావడం సహజమే. అన్ని సినిమాల్లాగానే ఆదిపురుష్ సినిమాపై కూడా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ టీమ్ ఇలాంటి రూమర్స్ కు పెద్దగా ఆస్కారం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా నిబంధనలతో ఆదిపురుష్ టీమ్ ప్రీ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన సంగతి చెప్పాడు ఓం రౌత్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' కోసం 'అవతార్' టీమ్..?

తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రావాలి. అయితే ఇప్పటివరకూ కీర్తి సురేష్, కియారా పేర్లు తెరపైకి వచ్చాయి. క్లారిటీ ఇచ్చేలోపు ఇంకెన్ని పేర్లు వస్తాయో చూడాలి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న ప్రభాస్

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. అంతే కాదు ఒక పార్క్ ను కూడా దత్తత తీసుకుంటానని చెప్పిన సంగతి కూడా విదితమే. ఇందులో భాగంగానే ఈ రోజు కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కును దత్తత తీసుకున్నాడు. అంతేకాదు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌తో క‌లిసి హీరో ప్ర‌భాస్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవ‌తో పార్కును ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తెలిపారు. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో ప్రభాస్ అడ్వాన్స్ బర్త్ డే సీడీపీ రిలీజ్

"ఈశ్వర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ "వర్షం " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సెన్సేషనల్ హీరోగా సినీ మా అవార్డ్ అందుకున్నారు. "ఛత్రపతి ", "బిల్లా ", "Mr పర్ ఫెక్ట్", "మిర్చి " వంటి మూవీస్ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందారు. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఏర్పడింది. బాలీవుడ్ లో హీరో ప్రభాస్ పై క్రేజ్ పెరిగింది. ప్రభాస్ హీరోగా నటించిన స్టైలిష్ మూవీ "సాహో " బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఓపికతో ఉండండి.. టీజర్స్, ట్రైలర్స్ అన్నీ వస్తాయి

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు యూరప్ లో షూటింగ్ లు జరుపుకోగా కరోనా వల్ల ఇక్కడకు వచ్చేసారు. మళ్ళీ షూటింగ్ ను సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి మొదలుకానుందని ఇటీవలే తెలియచేసారు. ఇక ఈ సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూడగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇదిలా ఉండగా రాధా కృష్ణ తన ట్విట్టర్ ద్వారా అభిమానులను ఈ సినిమా గురించి ముఖ్యమైన ప్రశ్నలు అడగమని చెప్పగా ఇంకా అభిమానులు పలు ప్రశ్నలు అడుగగా వాటిలో కొన్నిటికి రాధా కృష్ణ సమాధానాలు తెలిపారు. ఆ సమాధానాలు ఇవే..

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

కరోనా నిబంధనలతో ప్రీ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన 'ఆదిపురుష్' టీమ్

'ఆదిపురుష్' టీమ్ రాపిడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన దగ్గరనుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ను కుష్ చేస్తున్నారు. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత, సాహో సినిమాలకు అప్ డేట్స్ ఎంత లేట్ గా వచ్చాయో తెలుసు. రాధే శ్యామ్ సినిమాకు అయితే ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తేకాని ఆ టైటిల్ పోస్టర్ పోస్టర్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు 'ఆదిపురుష్' టీం మాత్రం వరుస అప్ డేట్స్ ఇస్తుంది.

TFN Adminవాట్సాప్
Prabhas To Practice Archery At Home For Adipurush?
సినిమా వార్తలు

ఇంట్లోనే విలు విద్య ప్రాక్టీస్ ..?

బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆది పురుష్‌’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్న సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు ఓం రౌత్ కొత్త మేకోవర్ తో కొత్త ప్రభాస్ ను చూపించబోతున్నట్టు మాత్రం అర్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన శరీరాకృతిని కొత్తగా చూపించబోతున్నామని... అలాగే విలు విద్య కూడా నేర్చుకోబోతున్నాడని డైరెక్టర్ చెప్పడం జరిగింది.

TFN Adminవాట్సాప్
Bollywood Actress Kiara Advani To Play The Lead Role In Prabhas Adipurush
సినిమా వార్తలు

"ఆది పురుష్ "మూవీ లో హీరోయిన్ కియారా అద్వానీ ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా ఒక బాలీవుడ్ మూవీ అనౌన్స్ అయింది. హీరో ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ లో నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ కి చెల్లెలిగా నివేద థామస్..?

ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ తో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కూడా వుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ కు విలన్ గా సైఫ్ అలీఖాన్..?

ఏదైనా కొత్త సినిమా రాబోతుందంటే రూమర్స్ రావడం సహజం. అలాటింది ప్రభాస్ సినిమా.. భారీ బడ్జెట్ సినిమా.. బాలీవుడ్ డైరెక్టర్ అంటే ఆ సినిమాపై ఎన్ని రూమర్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది ఆదిపురుష్ సినిమాకు. ఈ సినిమాను నిన్ననే అధికారికంగా ప్రకటించారు. ఆదిపురుష్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కబోతుందని.. రామునిగా ప్రభాస్ కనిపించనున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే..బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' లో ప్రభాస్ పాత్ర చెప్పేసిన నాగ్ అశ్విన్

బాహుబలి సిరీస్ కు ముందు ప్రభాస్ రేంజ్ వేరు.. బాహుబలి సిరీస్ తర్వాత వేరు.. ఈ సిరీస్ తో ప్రభాస్ స్థాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది. ఒక గ్యాంగ్ స్టర్ అయినా లవర్ బాయ్ అయినా ఒక యోధుడిగా అయినా ఇలా ఒక్కటేంటి అన్ని రోల్స్ కు కూడా ప్రభాస్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఏదో నాలుగు ఫైట్ లు నాలుగు పాటలు ఉన్న సినిమాలు చేయడానికి లేదు ప్రభాస్. ప్రభాస్ నుండి కూడా అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే రోజులు పోయాయి. అందుకే ఇప్పుడు భారీ సినిమాలనే లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో భారీ అండ్ పాన్ ఇండియాగా 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్…

TFN Adminవాట్సాప్

షేర్