ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న ప్రభాస్

Rebel Star Prabhas Adopts An Urban Forest Near Dundigal In Telangana

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. అంతే కాదు ఒక పార్క్ ను కూడా దత్తత తీసుకుంటానని చెప్పిన సంగతి కూడా విదితమే. ఇందులో భాగంగానే ఈ రోజు కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కును దత్తత తీసుకున్నాడు. అంతేకాదు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌తో క‌లిసి హీరో ప్ర‌భాస్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవ‌తో పార్కును ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తెలిపారు. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌క్ష‌ణ సాయంగా రూ.2 కోట్లు అంద‌జేసిన‌ ప్ర‌భాస్.. అవ‌స‌రాన్ని బ‌ట్టి మ‌రింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా… కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.

ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రభాస్ తన 22వ సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రానికి “ఆది పురుష్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.