మొత్తానికి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలు కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి షూటింగ్ లను ప్రారంభిస్తున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్యాలు అనుమతులు ఇచ్చినా కరోనాకు భయపడి షూటింగ్ లను జరపలేదు. అయితే ఇప్పట్లో కరోనాకు అంతం లేదని భావించి.. తక్కువ మంది స్టాఫ్ తో కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లను జరపడానికి రెడీ అయిపోతున్నారు. ఒక పది. పదిహేను రోజుల పెండింగ్ వున్న సినిమాలు అయితే ఇప్పటికే షూటింగ్ ను మొదలు పెట్టి మిగిలిన షూట్ ను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్స్ అందరూ చిన్నగా హైదరాబాద్ లో వాలిపోతున్నారు. దీనిలో భాగంగానే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం పూజాహెగ్డే రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాల్లో నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగుల్లో పాల్గొనడానికి పూజా హెగ్డే ఇక్కడికి వచ్చేసింది. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది.
‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి అఖిల్ ఫస్ట్ లుక్.. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
మరి సినిమా రిలీజ్ ల సంగతి తర్వాత ఫస్ట్ షూట్ అయిపోతే ఒక పని అయిపోద్ది అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. షూటింగ్ లు అయిపోతే థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఓటీటీలో అయినా రిలీజ్ చేసుకోవచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: