యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా ఒక బాలీవుడ్ మూవీ అనౌన్స్ అయింది. హీరో ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ లో నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “తానాజీ ” మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో టి- సిరీస్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ లో “ఆదిపురుష్ ” మూవీ రూపొందనుంది. ఈ పాన్ ఇండియా మూవీ లో రాముడు గా నటిస్తున్న హీరో ప్రభాస్ ఆర్చరీ లో ట్రైనింగ్ తీసుకోనున్నారు. “ఆదిపురుష్ ” మూవీ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ ఫేమ్ కియారా అద్వానీ ని హీరోయిన్ గా చిత్ర యూనిట్ సంప్రదిస్తున్నట్టు సమాచారం. కియారా అద్వానీ ప్రస్తుతం పలు హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. “ఆదిపురుష్ ” మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీఇవ్వడం దేశ వ్యాప్తం గా ఉన్న ప్రభాస్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: