బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆది పురుష్’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్న సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు ఓం రౌత్ కొత్త మేకోవర్ తో కొత్త ప్రభాస్ ను చూపించబోతున్నట్టు మాత్రం అర్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన శరీరాకృతిని కొత్తగా చూపించబోతున్నామని… అలాగే విలు విద్య కూడా నేర్చుకోబోతున్నాడని డైరెక్టర్ చెప్పడం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనిలో భాగంగా అప్పుడే ప్రభాస్ విలు విద్య నేర్చుకోడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. అది కూడా ఇంట్లో ఉండే నేర్చుకోడానికి సిద్ధమైనట్టు సమాచారం. నిజానికి బాహుబలి సినిమా అప్పుడే ప్రభాస్ తన ఫామ్ హౌస్ లో విలు విద్య శిక్షణ తీసుకునేవాడట. దానికి సంబందించిన పరికరాలు మొత్తం అక్కడే ఉన్నాయట. అయితే ఇప్పుడు వాటిని ఇంటికి తెప్పించుకోవాలని.. ఇంట్లోనే ప్రాక్టీస్ చెయ్యాలన్న ప్లాన్ లో ఉన్నారట. ఇప్పటికే శరీరాకృతిపై దృష్టి పెట్టిన ప్రభాస్.. తొందర్లోనే విలు విద్యకు సంబంధించి ట్రైనింగ్ కూడా మొదలపెట్టనున్నాడట.
ఇక ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనుండగా.. భూషణ్ కుమార్, ప్రశాంత్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. 3Dలో ఈ సినిమా రూపొందించనున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై కొంత వరకూ పూర్తి చేసుకుంది. ఇక ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమాలో నటించనున్నాడు ప్రభాస్. వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇక ఆదిపురుష్ రెగ్యూలర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలుతుందో చెప్పడం కష్టం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: