కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Charan

ట్యాగ్ · 713 కథనాలు · పేజీ 32

సినిమా వార్తలు

ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు చెర్రీ కూడా నటిస్తుండతంతో ఈసినిమాపై క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రస్తుతం సినిమా మారేడు మిల్లిలోని అటవీ ప్రాంతంలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. చిరంజీవి, చరణ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ద్వారా బయటకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అలియా పై రామ్ చరణ్ ప్రశంసలు

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్ నటిస్తున్న సినిమా గంగూబాయికతియావాడీ. ఈ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా అందులో అలియా నటన చూసినవారందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలియా భట్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తల్లిదండ్రులకు చరణ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి నేడు 42వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖను చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న వివాహమాడారు. వీరిద్దరూ ఒక్కటై నేటితో 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దంపతులు ఇద్దరికీ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ సందర్భంగా తనయుడు రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ వేదికగా తన తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసాడు. చిరంజీవి-సురేఖ కూర్చున్న ఫొటోను షేర్ చేసి... ‘నా అతిపెద్ద బలం మీరే. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు రామ్ చరణ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' కోసం ప్రతిఒక్కరూ

ఆర్ఆర్ఆర్ టార్గెట్ అక్టోబ‌ర్ 13.. అలానే కనిపిస్తుంది రాజమౌళి షూటింగ్ చేస్తున్న విధానం చూస్తుంటే. ఈ సినిమాను అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆ దిశగా షూటింగ్ ను గ్యాప్ లేకుండా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలా లేదనుకున్నా చాలా ఎక్కువ టైమే పడుతుంది. మరి అనుకున్న టైం కే సినిమా రిలీజ్ అవ్వాలంటే.. ఈ రేంజ్ లో షూటింగ్ జరపాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య' లో విలన్ గా 'జిషు సేన్ గుప్తా'

మొత్తానికి ఆచార్య ను ఢీ కొట్టగలిగే విలన్ దొరికాడు డైరెక్టర్ కొరటాల శివకు. షూటింగ్ దాదాపు పూర్తవ్వడానికి వస్తున్నా విలన్ పాత్రను మాత్రం ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఆ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. చిరుకు విలన్ గా జిషు సేన్ గుప్తాను సెలెక్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లైకా ప్రొడక్షన్స్ కు 'RRR' తమిళ్ హక్కులు

పెద్ద సినిమాలు అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందని తెలిసిందే. ముందు నుండే సినిమా హక్కులు బుక్ చేసుకునే పనిలో వుంటారు. అందులో రాజమౌళి సినిమా అంటే ఇంకా ఏ రేంజ్ లో అమ్మకాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే జరిగింది రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు రావడంతో అప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ కన్ను ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ త‌మిళ హ‌క్కులను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ద‌క్కించుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగా న్యూస్.. చరణ్-శంకర్ సినిమా కన్ఫామ్

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోపక్క కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ పై ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఎవరితో సినిమా ఉంటుందన్న క్లారిటీ లేదు. అయితే కొద్దిరోజులుగా రామ్ చరణ్ తర్వాత సినిమా శంకర్ తో ఉంటుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మాత్రం సడెన్ గా మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రామ్ చరణ్, శంకర్ తో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ర్' క్లైమాక్స్‌ రిహార్సల్స్‌ లో ఎన్టీఆర్, చరణ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల దాదాపు షూటింగ్ కు చాలా గ్యాప్ రాగా ఇప్పుడు అసలు బ్రేక్ లేకుండా రాజమౌళి షూటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ లోపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ లను అయితే రిలీజ్ చేశారు. వాటికి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిందనుకోండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగా '13' సెంటిమెంట్

నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు.

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Acharya Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Megastar Chiranjeevi Acharya,Acharya,Acharya Movie,Acharya T
ట్రైలర్ & టీజర్

ఆచార్య టీజర్ రిలీజ్ - దైవమే కాపాడాల్సిన పనిలేదు

ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ వచ్చేసింది. ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన ఆచార్య టీం చెప్పినట్టే టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక మెగా అభిమానుల ఆశించినట్టే.. వారి అంచనాలకు తగ్గట్టే ఈ టీజర్ ఉంది. ముందు నుండి చెప్పినట్టే రామ్ చరణ్ వాయిస్ తో టీజర్ ప్రారంభమైంది. మెగా స్టార్ మార్క్.. గ్రేస్ రెండూ టీజర్ లో కనిపిస్తున్నాయి. వయసు అనేది కేవలం నెంబర్ అన్నట్టు యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చిరు చేసిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అంతేకాదు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ - జెన్నీఫర్ గా ఎన్టీఆర్ హీరోయిన్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రెగ్యులర్ గా ఇస్తూనే ఉన్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజు ఈ సినిమా రిలీజ్ కూడా ప్రకటించాడు. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. భారీ పీరియాడికల్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌కు…

TFN Adminవాట్సాప్
Tollywood Star Hero To Give Voice Over For Acharya Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan Voice Over For Acharya Teaser,Tollywood Star Hero Voice Over For
ట్రైలర్ & టీజర్

'ఆచార్య' టీజర్ కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!

ఆచార్య టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ఈ రోజు ఉదయాన్నే మెగా అభిమానులకు కొరటాల సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఫ్యాన్స్ 29 కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇంకా ఆ సంతోషంలో ఉండగానే ఇప్పుడు మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ విషయాన్ని ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టడంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఆచార్య టీజర్ లో చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా... అహా బయట టాకు' అంటూ బ్రహ్మానందం ఫొటోతో ఉన్న ఒక మీమ్ ను పోస్ట్ చేసాడు. మరి స్వయంగా వరుణే ఈ ట్వీట్ చేయడంతో ఇది నిజమే అన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ ఫిక్స్

మూడేళ్ల నిరీక్షణకు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల ఎదురచూపులకు ఫైనల్లీ ఈ రోజు కాస్త ఊరట కలిగించారు ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్. ఈ సినిమా గత రెండేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అసలే లేట్ అయింది అనుకుంటే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇటీవలే క్లైమాక్స్ షూటింగ్ జరుపుతున్నట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ లోపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ లను అయితే రిలీజ్ చేశారు. వాటికి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిందనుకోండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆచార్య - 'సిద్ధ' గా చెర్రీ

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
Ram Charan hails Ravi Teja for krack movie,Ram Charan Heaps Praises Of His Favourite Star Ravi Teja And Krack,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan,Ram Charan Latest
సినిమా వార్తలు

'క్రాక్' చాలా ఎంజాయ్ చేశా

య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. జనవరి 9 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. గోపీచంద్-రవితేజ ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"రౌద్రం రణం రుధిరం " మూవీ అప్ డేట్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్ , తారాగణం తో మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా , ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుండి హీరోయిన్ అలియా భట్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వర్క్ ఎక్స్పీరియన్స్ పై అలియా

ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు కు రామ్ చరణ్ కృతజ్ఞతలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రామ్ చరణ్ ఇంటికే పరిమితం అయ్యి ఆ విషయాన్ని సోషల్ మీడియా లో అనౌన్స్ చేశారు. తమ అభిమాన హీరోకు కరోనా అని తెలియగానే లక్షలాది మంది అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ ఆరోగ్యం పై మహేష్ బాబు స్పందించి జాగ్రత్తగా ఉండమనీ, త్వరగా కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నా అనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

సెలెబ్రిటీస్ ను మాత్రం కరోనా ఇప్పుడప్పుడే వదిలే ప్రసక్తి కనిపించట్లేదు. అసలు ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ అని చెపుతూ షాకులిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ మాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.. అయినా పాజిటివ్ వచ్చింది అని చెప్పిన సంఘటనలు గుర్తుండేవుంటాయి . అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా పాజిటివ్ అని చెప్పి షాకిచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పర్ఫెక్ట్ ఫ్రేమ్ - హీరోలందరూ ఒకే ఫ్రేమ్ లో

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న రేంజ్ కు ఎదిగాడు. ఇక గత ఏడాది సంక్రాంతి కి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు.. ఈ ఏడాది కూడా మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవలే రెండో పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్

షేర్