ఆచార్య టీజర్ రిలీజ్ – దైవమే కాపాడాల్సిన పనిలేదు

Mega Star Chiranjeevi Acharya Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Megastar Chiranjeevi Acharya,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Teaser,Acharya Teaser,Acharya Movie Teaser Out,Acharya Movie Teaser Released,Acharya Movie Teaser Unveiled,Megastar Chiranjeevi Acharya Movie Teaser,Acharya Movie Teaser Out Now,Chiranjeevi Acharya,Acharya Teaser Out,Ram Charan,Koratala Siva,Acharya Telugu Movie Teaser,#AcharyaTeaser,#Acharya

ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ వచ్చేసింది. ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన ఆచార్య టీం చెప్పినట్టే టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక మెగా అభిమానుల ఆశించినట్టే.. వారి అంచనాలకు తగ్గట్టే ఈ టీజర్ ఉంది. ముందు నుండి చెప్పినట్టే రామ్ చరణ్ వాయిస్ తో టీజర్ ప్రారంభమైంది. మెగా స్టార్ మార్క్.. గ్రేస్ రెండూ టీజర్ లో కనిపిస్తున్నాయి. వయసు అనేది కేవలం నెంబర్ అన్నట్టు యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చిరు చేసిన యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. అంతేకాదు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు…పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో” అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ‘సిద్ధ’ అనే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇందులో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఒక‌వైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 16 =