‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రతిఒక్కరూ

RRR Movie Team Shares Sneak Peek Of A Massive Scene Being Shot On Social Media,RRR,RRR Movie,RRR Film,RRR Telugu Movie,RRR Movie Telugu,RRR Update,RRR Movie Update,RRR Movie Latest News,RRR Movie Latest Reports,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,RRR Shoot,RRR Shooting Update,Ram Charan,Jr NTR,SS Rajamouli,RRR Team Shared A Shoot Video,RRR Cast And Crew,RRR Movie Sets,RRR Team Shoot A Massive Scene,RRR Final Shooting Schedule,RRR Climax Scenes,RRR Diaries,RRR Shoot For A Massive Scene,RRR Shoot Massive Scene,RRR Massive Scene,RRR Team Shoot For A Massive Scene,RRR Sets Video,RRR Sneak Peek,RRR Movie Sneak Peek,RRR Massive Sneak Peek Of A Scene,SS Rajamouli RRR,RRR Movie Team Shares Sneak Peek Of A Massive Scene,#RRRMovie,#RRR

ఆర్ఆర్ఆర్ టార్గెట్ అక్టోబ‌ర్ 13.. అలానే కనిపిస్తుంది రాజమౌళి షూటింగ్ చేస్తున్న విధానం చూస్తుంటే. ఈ సినిమాను అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆ దిశగా షూటింగ్ ను గ్యాప్ లేకుండా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలా లేదనుకున్నా చాలా ఎక్కువ టైమే పడుతుంది. మరి అనుకున్న టైం కే సినిమా రిలీజ్ అవ్వాలంటే.. ఈ రేంజ్ లో షూటింగ్ జరపాల్సిందే.

ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. చాలా కీలకమైన పోర్షన్స్ నే కంప్లీట్ చేసుకుంది. ఇక షూటింగ్ కు సంబంధించిన వీడియోలు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసారు. మాసివ్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతుండగా, దానికి సంబంధించిన ఏర్పాట్ల‌పై ఓ వీడియోని విడుద‌ల చేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఇక వీడియో పోస్ట్ చేస్తూ… దానికి ప్రతి ఒక్కరూ తన చేయి అందిస్తున్నారు అనేలా పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here