‘ఆర్ఆర్ర్’ క్లైమాక్స్‌ రిహార్సల్స్‌ లో ఎన్టీఆర్, చరణ్

Jr.NTR and Ram Charan Candid Pics From RRR Climax Rehearsals,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,NTR And Ramcharan Attend RRR Practice Sessions For The Climax,Jr Ntr And Ram Charan Practicing For RRR Climax Scene,Jr Ntr,Hero NTR,Ram Charan,Mega Powerstar Ram Charan,RRR,RRR Movie,RRR Film,RRR Telugu Movie,RRR Movie Telugu,RRR Movie News,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Movie Latest Reports,SS Rajamouli,RRR,SS Rajamouli RRR,NTR and Ram Charan Candid Pics From RRR,Jr Ntr And Ram Charan Candid Pics,RRR Climax Rehearsals,#RRR,#RRRMovie

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల దాదాపు షూటింగ్ కు చాలా గ్యాప్ రాగా ఇప్పుడు అసలు బ్రేక్ లేకుండా రాజమౌళి షూటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ లోపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ లను అయితే రిలీజ్ చేశారు. వాటికి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిందనుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇటీవలే క్లైమాక్స్ షూటింగ్ జరుపుతున్నట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే కదా. రాజమౌళి సినిమా అంటే.. ముందుగానే రిహార్సల్స్‌ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే పని చేస్తున్నాడు రాజమౌళి. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. షూటింగ్ లొకేషన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మాట్లాడుకుంటున్న ఒక ఫొటోను ‌ చిత్రయూనిట్‌ విడుదల చేసి.. శక్తివంతమైన క్లైమాక్స్‌ కోసం రిహార్సల్స్‌’ జరుగుతున్నాయని తెలిపారు.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్‌‌ విడుదల కానున్నట్టు ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =