వర్క్ ఎక్స్పీరియన్స్ పై అలియా

#RRR Movie Latest News, Alia Bhatt about RRR, Alia Bhatt New Movie Details, Alia Bhatt RRR, Alia Bhatt RRR Movie Shooting, Alia Bhatt SS Rajamouli RRR Movie, Alia Role in RRR, Bollywood Actress Alia Bhatt, Jr. NTR, Latest Tollywood News, Ram charan, RRR Movie Movie Updates, SS Rajamouli, SS Rajamouli RRR Alia Bhatt, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 10 రోజుల షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా ఆర్ఆర్ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ అని… నాకు తెలియని లాంగ్వేజ్… చాలా రోజులు నా లైన్స్ ను గుర్తుపెట్టుకున్నా.. నిద్రలో కూడా చెప్పేంత గుర్తుపెట్టుకున్నా అని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాలెంటెడ్ నటులతో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.

కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =