లైకా ప్రొడక్షన్స్ కు ‘RRR’ తమిళ్ హక్కులు

Lyca Productions Buys Theatrical Rights For RRR Tamil Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,RRR,RRR Movie,RRR Film,RRR Telugu Movie,RRR Movie Telugu,RRR Update,RRR Latest Updates,RRR Latest Reports,RRR Mocie Latest News,RRR Rights,Lyca Productions AcquiresTheatrical Rights For RRR Tamil Movie,Lyca Productions,Lyca Productions RRR,Lyca Productions News,Lyca Productions Buys Theatrical Rights For RRR Tamil,RRR Tamil Nadu Rights Acquired,RRR Tamil Nadu Rights,RRR Movie Tamil Nadu Rights,RRR Tamil Nadu Theatrical Rights,SS Rajamouli,Ram Charan,Jr NTR,RRR Tamil Nadu Theatrical Rights Acquired,RRR Movie Tamil Nadu Theatrical Rights,#RRR,#RRRMovie

పెద్ద సినిమాలు అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందని తెలిసిందే. ముందు నుండే సినిమా హక్కులు బుక్ చేసుకునే పనిలో వుంటారు. అందులో రాజమౌళి సినిమా అంటే ఇంకా ఏ రేంజ్ లో అమ్మకాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే జరిగింది రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు రావడంతో అప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ కన్ను ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ త‌మిళ హ‌క్కులను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ద‌క్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ విషయాన్ని లైకా ప్రొడెక్షన్స్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. ‘బిగ్గెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ తమిళనాడు థియేట్రికల్ హక్కులను దక్కించుకుంచుకున్నామని ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది’అంటూ లైకా ప్రొడక్షన్స్‌ ట్విట్‌ చేసింది. బాహుబలి ఇంపాక్ట్ తో.. రాజమౌళి సినిమాలకు ఉన్న డిమాండ్ ను బట్టి బాహుబలి కంటే భారీ రేటుకే ఈ సినిమా హక్కులను లైకా సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.

కాగా భారీ పీరియాడికల్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమ్రం భీం పాత్ర‌లో, అలియాభ‌ట్ సీత పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న సినిమా 2021అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 10 =