తల్లిదండ్రులకు చరణ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు

Ram Charan On His Tweet Greeting His Parents On Their Wedding Anniversary Says they Are His Biggest Strength,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ram Charan,Maga Power Star Ram Charan,Chiranjeevi,Actor Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi And Surekha,Chiranjeevi And Surekha 42 Anniversary,Ram Charan Sweet Wishes To To His Parents Chiranjeevi And Surekha,Ram Charan Celebrates His Parents 42 Anniversary,Ram Charan Greeting To His Parents On Their 42 Anniversary,Chiranjeevi And Surekha Celebrating Their 42nd Anniversary Today,Chiranjeevi And Surekha Marriage Anniversary,Ram Charan Wishes Parents Chiranjeevi And Surekha On 42Nd Wedding Anniversary,Ram Charan Wishes Chiranjeevi And Surekha On Their Wedding Anniversary,Chiranjeevis 42nd Wedding Anniversary

మెగాస్టార్ చిరంజీవి నేడు 42వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖను చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న వివాహమాడారు. వీరిద్దరూ ఒక్కటై నేటితో 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దంపతులు ఇద్దరికీ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ సందర్భంగా తనయుడు రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ వేదికగా తన తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసాడు. చిరంజీవి-సురేఖ కూర్చున్న ఫొటోను షేర్ చేసి… ‘నా అతిపెద్ద బలం మీరే. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు రామ్ చరణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చిరు-రామ్ చరణ్ ఆచార్య సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ సిద్ద అనే పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఎప్పటినుండో తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఒకే సినిమాలో చేయాలన్న సురేఖ గారి కోరిక ఈ సినిమాతో తీరనుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − five =