డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న రేంజ్ కు ఎదిగాడు. ఇక గత ఏడాది సంక్రాంతి కి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు.. ఈ ఏడాది కూడా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవలే రెండో పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ రోజు దిల్ రాజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 50 వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికీ గ్రాండ్ పార్టీనే ఇచ్చాడు. ఈవెంట్ తో తారలంతా ఒక్కచోట చేరారు. స్టార్ హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్, రాంచరణ్, విజయ్ దేవరకొండతోపాటు రామ్, నాగచైతన్య దిల్ రాజు కు బర్త్ డే విషెస్ చెప్పి ఆయనతో కలిసి కెమెరా ఫోజులిచ్చారు. ఇక ఈ ఫొటోను రౌడీ హీరో తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. బిగ్ బాయ్స్ తో నేను అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
The Big Boys and the kid!
Last night 🙂 pic.twitter.com/mrabRRgSg9— Vijay Deverakonda (@TheDeverakonda) December 18, 2020
మరి కరోనా వల్ల టాలీవుడ్ సందడి లేకుండా పోయింది. హీరోల పెళ్లిళ్లు అయినా కూడా వెళ్లలేని పరిస్థితి. అయితే ఇన్నిరోజులు మళ్లీ హీరోలందరినీ ఒకే ఫ్రేమ్ లో చూడటం నిజంగా కనులకు విందు లాంటిదే. ఇక అభిమానులు కూడా ఈఫొటో చూసి ఫిదా అయిపోతున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: