ఆచార్య ‘సిద్ధ’మవుతున్నాడు

Sneak Peek Of Ram Charan Look From Acharya Movie Unveiled,Ram Charan,Mega Power Star Ram Charan,Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi Acharya,Acharya,Acharya Movie,Acharya Film,Acharya telugu Movie,Acharya Update,Ram Charan Latest News,Ram Charan Shares A Glimpse Of His Look With Chiranjeevi From Acharya,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Glimpse Of Ram Charan From Acharya,Acharya Sets,Ram Charan Shares Pic From Acharya Sets,Ram Charan Shares A Comrade Moment From Acharya Sets,Acharya Look,Ram Charan In Acharya,Ram Cahran Acharya Look,Megastar Acharya,Ramcharan Look From Acharya,Ramcharan New Look From Acharya Movie,Ramcharan Latest Look From Acharya,Ramcharan Look Acharya,Ram Charan Acharya Movie Look

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు చెర్రీ కూడా నటిస్తుండతంతో ఈసినిమాపై క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రస్తుతం సినిమా మారేడు మిల్లిలోని అటవీ ప్రాంతంలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. చిరంజీవి, చరణ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ద్వారా బయటకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా రామ్‌చరణ్‌ ఫొటోను ఓకటి కొరటాల శివ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి ‘ఆచార్య సిద్ధమవుతున్నాడు’ అంటూ పోస్ట్‌ చేశాడు. ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ సిద్ధ అనే ఓ పవర్‌పుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ పోస్ట్ తో చరణ్ కు సంబంధించి అప్ డేట్ ఏమైనా ఇస్తున్నాడా కొరటాల అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మే 13 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here