మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రామ్ చరణ్ ఇంటికే పరిమితం అయ్యి ఆ విషయాన్ని సోషల్ మీడియా లో అనౌన్స్ చేశారు. తమ అభిమాన హీరోకు కరోనా అని తెలియగానే లక్షలాది మంది అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ ఆరోగ్యం పై మహేష్ బాబు స్పందించి జాగ్రత్తగా ఉండమనీ, త్వరగా కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నా అనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు ట్వీట్ కు రామ్ చరణ్ స్పందించి కృతజ్ఞతలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు. మహేష్ బాబు , రామ్ చరణ్ ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. స్టార్ హీరోల స్నేహభావాన్ని అర్ధం చేసుకోకుండా అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్పనీ వాదులాడుకోకుండా స్నేహ భావం తో కలసి మెలసి ఉండాలనీ , తమ అభిమాన హీరో మూవీస్ తో పాటు ఇతర హీరోల మూవీస్ కూడా చూసి ఎంజాయ్ చేయాలనీ కోరుకుందాం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: