‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Jr NTR And Ram Charan’s RRR Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR,Ram Charan,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Release Date Locked,RRR Movie Release Date Confirmed,RRR Telugu Movie Release Date Fixed

మూడేళ్ల నిరీక్షణకు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల ఎదురచూపులకు ఫైనల్లీ ఈ రోజు కాస్త ఊరట కలిగించారు ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్. ఈ సినిమా గత రెండేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అసలే లేట్ అయింది అనుకుంటే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్ ను జరుపుతున్నారు. ఇటీవలే క్లైమాక్స్ షూటింగ్ జరుపుతున్నట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ లోపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ లను అయితే రిలీజ్ చేశారు. వాటికి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిందనుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ డేట్ ను ప్రకటించి కాస్త సర్ప్రైజే ఇచ్చాడు జక్కన్న. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్‌‌ విడుదల కానున్నట్టు ప్రకటించారు. ‘నీరు-అగ్నిల ప్రవాహ బలానికి ఈ అక్టోబర్ 13వ తేదీ వేదిక కానుంది అంటూ రామ్‌‌చరణ్ గుర్రంపై, జూనియర్ ఎన్టీఆర్ బైక్‌పై ఉన్న ఫొటోను షేర్ చేశారు.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 17 =