
ట్యాగ్ · 42 కథనాలు · పేజీ 2

హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్

హీరో నితిన్ "దిల్ ఖుషి "
నితిన్ 'ఎంగేజ్‌మెంట్' - పెళ్లి వేడుకలు షురూ..!
నితిన్ పెళ్లి విషయంలో మార్పు..!

నితిన్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్..!
ఆగష్ట్ లో మొదలుపెట్టడానికి చూస్తున్న నితిన్..!

నితిన్ కు జోడీగా నభా నటేష్ ?
నితిన్‌కి జోడిగా ప్రియాంకా అరుళ్ మోహన్?

‘భీష్మ’తో ‘మహానటి’?

కరోనా కట్టడి కై హీరో నితిన్ సందేశం

యువకుడిగా ..మధ్య వయస్కుడిగా ..వృద్ధుడిగా

కరోనా కోసం తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం
అంధాధున్ మూవీ తెలుగు రీమేక్ నిర్మాత నితిన్

షూటింగ్ కు సిద్ధం - నితిన్
"భీష్మ " మూవీ ఘన విజయం సాధించడంతో జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ వరస మూవీస్ కు కమిట్ అయ్యారు. సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో "చెక్ ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధా ధున్ " తెలుగు రీమేక్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో "పవర్ పేట " మూవీస్ లో నితిన్ నటిస్తారు.
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు నితిన్ గిఫ్ట్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భీష్మ ఈ ఏడాది శివరాత్రి రోజున విడుదలై సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస కళ్యాణం సినిమా పరాజయం తరువాత చాల గ్యాప్ తీసుకొని నితిన్ చేసిన సినిమా భీష్మ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.

హీరో నితిన్ "దిల్ ఖుషి "
యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం "భీష్మ " మూవీ తో విజయం సాధించి ఆనందం గా ఉన్నారు. వరుస మూవీస్ తో నితిన్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న "రంగ్ దే "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో కీర్తి సురేష్ కథానాయిక. దర్శకులు చంద్ర శేఖర్ యేలేటి , మేర్లపాక గాంధీ , కృష్ణ చైతన్య మూవీస్ కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు మరో మూవీ ని అనౌన్స్ చేయనున్నారు.
నితిన్ 'ఎంగేజ్‌మెంట్' - పెళ్లి వేడుకలు షురూ..!
నితిన్-షాలిని పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో నితిన్, షాలినిల పసుపు, కుంకుమ వేడుక జరిగింది. ఆ తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో లాక్‌డౌన్ వచ్చిపడింది. దీంతో పెళ్లి లేట్ అవుతుండటంతో పెళ్ళిచేసేయాలని ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో నితిన్ షాలినిల కుటుంబ పెద్దలు ఇరువైపులా తాంబూళాలు మార్చుకుని నిశ్చితార్థం నిర్వహించారు. ఎంగేజ్‌మెంట్‌తో ఐదు రోజుల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇక విషయ్నాన్ని నితిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఎంగేజ్డ్ అంటూ నితిన్-షాలిని ఎంగేజ్మెంట్ ల ఫొటో ను పోస్ట్ చేసాడు.

ముహూర్తం ఫిక్స్... అనుకున్న డేట్ కే నితిన్ వివాహం..!
మొత్తానికి నితిన్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. కరోనా కారణంగా హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు వాయిదా వేశారు. ఫిబ్రవరిలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత చాలా గ్రాండ్‌గా ఈ పెళ్లిని జరపాలని ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల కుదర్లేదు. అయితే మరీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు ఇరు కుటుంబసభ్యలు. ఈ నేపథ్యంలోనే జులై 26న వీరిద్దరి వివాహం జరగనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఫైనల్ గా అధికారికంగా కూడా ప్రకటించారు.

3 మిలియన్ స్ట్రాంగ్.. నా ఫాలోవర్స్ కి పెద్ద థ్యాంక్స్..!
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇటీవల మహేష్ బాబు, ప్రభాస్, పూజా హెగ్డే, విజయదేవరకొండ మిలియన్స్ లలో అభిమానులను సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నితిన్ కూడా ట్విటర్‌లో 3 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
నితిన్ పెళ్లి విషయంలో మార్పు..!
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో నితిన్ కూడా ఉంటాడు. అయితే ఈ ఏడాది ఆ లిస్ట్ నుండి బయటకి రాబోతున్నాడు. నితిన్ కు, షాలినితో వివాహం జరగబోతున్న సంగతి తెలసిందే. నితిన్, షాలినికి 2012లోనే పరిచయం ఏర్పడింది. స్నేహంతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగింది. పరిస్థితులు అన్ని బావుంటే ఏప్రిల్ 16నే వీరి వివాహానికి ముహూర్తం పెట్టారు. కానీ కరోనా వల్ల పెళ్లి వాయిదా పడింది. ఇక పరిస్థితులు చక్కబడిన తర్వాత ఏడాది చివరిలో చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడప్పుడే కరోనా ప్రభావం తగ్గే పరిస్థితి లేదు. రోజు రోజుకు కేసులు కూడా…

నితిన్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్..!
చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు నితిన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టేసాడు. చంద్రశేఖర్ యేలేటి, 'ఛల్ మోహన్ రంగా' చేసిన కృష్ణచైతన్యతో అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ చేస్తున్నాడు నితిన్.
ఆగష్ట్ లో మొదలుపెట్టడానికి చూస్తున్న నితిన్..!
''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చి సూపర్ హిట్ టాక్ కొట్టాడు.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.

నితిన్ కు జోడీగా నభా నటేష్ ?
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ "భీష్మ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్ ప్రస్తుతం "రంగ్ దే ", చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందే "పవర్ పేట " మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

నితిన్ తో బోల్డ్ సీన్స్ నటించేందుకు రెడీ అయిన నాని హీరోయిన్..!
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకోగా... షూటింగ్ మొదలు పెడదాం అనుకునేలోపు కరోనా వల్ల బ్రేక్ పడింది. అందులో గుడ్డివాడి పాత్రలో నితిన్ నటించబోతున్నాడు. దీనికోసం నితిన్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.
నితిన్‌కి జోడిగా ప్రియాంకా అరుళ్ మోహన్?
'భీష్మ'తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసాడు యువ కథానాయకుడు నితిన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అంధాదున్' ఒకటి.

‘భీష్మ’తో ‘మహానటి’?
`భీష్మ` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యువ కథానాయకుడు నితిన్ నుంచి రాబోతున్న చిత్రం `రంగ్ దే`. ఇందులో నితిన్‌కు జోడీగా ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా విడుదలయ్యేలోపే.. నితిన్ సరసన మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నాయికగా నటించే ఛాన్స్ దక్కించుకుందట ఈ టాలెంటెడ్ బ్యూటీ.

కరోనా కట్టడి కై హీరో నితిన్ సందేశం
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ భారత్ లో కూడా ప్రభావం చూపుతుండటంతో ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ కట్టడికై కేంద్ర, తెలుగు రాష్ట్రాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్ నివారణ కై ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా హీరో నితిన్ ప్రజలకు, తన అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు.

హీరో నితిన్ కు భవ్య క్రియేషన్స్ బర్త్ డే శుభాకాంక్షలు
సూపర్ హిట్ "కార్తికేయ ", "ప్రేమమ్ " మూవీస్ ఫేమ్, వైవిధ్య భరిత చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో యాక్షన్ ఎంటర్ టైనర్ భవ్య ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 12 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

"రంగ్ దే! " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్, "మహానటి" కీర్తి సురేష్ జంటగా సూపర్ హిట్ "తొలిప్రేమ" ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే! " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

యువకుడిగా ..మధ్య వయస్కుడిగా ..వృద్ధుడిగా
చాలా గ్యాప్ తర్వాత భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టాడు నితిన్. నితిన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా భీష్మ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన నితిన్ ఖాతాలో పలు సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నాగవంశీ సితార బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

కరోనా కోసం తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే పలు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అనుమానిత కేసులు మాత్రం చాలానే నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణాలో 30కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 31వ వరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రభుత్వాలు.
భాగ్యనగరంలో నితిన్ - చంద్రశేఖర్ యేలేటి చిత్రం
యువ కథానాయకుడు నితిన్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయర్ కనిపించనుండగా... రకుల్ క్రిమినల్ లాయర్ గానూ, ప్రియా ప్రకాష్ హనీ ట్రాపర్ గానూ దర్శనమివ్వబోతున్నారని సమాచారం.
అంధాధున్ మూవీ తెలుగు రీమేక్ నిర్మాత నితిన్
యువ హీరో నితిన్ భీష్మ, రంగ్ దే, చదరంగం మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం లో మూడు సినిమాలతో అభిమానులను, ప్రేక్షకులను నితిన్ అలరించనున్నారు. బాలీవుడ్ లో 32 కోట్లతో నిర్మించిన అంధాధున్ మూవీ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 456 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.