”అ ఆ” లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ‘భీష్మ’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ టాక్ కొట్టాడు.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తరువాత చంద్రశేఖర్ యేలేటి, ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతో అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ చేస్తున్నాడు నితిన్. అందులో రంగ్ దే సినిమా కూడా ఒకటి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా ధైర్యం చేసి షూటింగ్స్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందో అని అంతా భయపడిపోతున్నారు. ఒకరిద్దరు దర్శకులు ధైర్యం చేసి షూటింగ్స్ ప్రారంభించినప్పటికీ, చాలా వరకు మాత్రం షూటింగ్స్ విషయంలో వెనక్కి తగ్గుతున్నారు.
అయితే ఇప్పుడు నితిన్ ‘రంగ్ దే’ షూట్‌ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. జూన్, జూలై అంతా చూశాక.. పరిస్థితులను అంచనా వేసి ఆగస్ట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ.. తన ‘రంగ్ దే’ షూటింగ్ స్టార్ట్ చేయాలనే నిర్ణయంలో చిత్రయూనిట్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: