కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ భారత్ లో కూడా ప్రభావం చూపుతుండటంతో ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ కట్టడికై కేంద్ర, తెలుగు రాష్ట్రాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్ నివారణ కై ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా హీరో నితిన్ ప్రజలకు, తన అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తం గా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఆందోళన పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితులలో తప్ప లాక్ డౌన్ కాలంలో ఎవ్వరూ బయటకు రాకూడదనే తన పుట్టిన రోజు జరుపుకొనడం లేదని, అభిమానులు ఎక్కడా తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని ప్రార్థిస్తున్నానని, ఏప్రిల్ 16 వ తేదీ జరగాల్సిన తన వివాహాన్ని వాయిదా వేసుకున్నానని, కరోనా వైరస్ ను కట్టడి చేయడానికై అందరం కలిసికట్టుగా పోరాటం చెయ్యాలని, ఈ సంక్షోభ సమయంలో ఇళ్ళకే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటం దేశానికి సేవ చేసినట్టేనని, మీ అభిమానం తో పాటు మీ ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటున్నానని నితిన్ సందేశం ఇచ్చారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























