
ట్యాగ్ · 54 కథనాలు · పేజీ 2


"కార్తికేయ 2 "మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం

దసరా బరిలో నిఖిల్ 'స్పై'

యంగ్ హీరో 'నిఖిల్' తండ్రి కన్నుమూత

"18 పేజెస్"మూవీ గ్లింప్స్ రిలీజ్

'కార్తికేయ2' షూటింగ్ అప్ డేట్..!

లైవ్ వెపన్స్ ట్రైనింగ్ లో నిఖిల్

పాండమిక్ ఎఫెక్ట్ కెరీర్స్ పై చాలా పడింది..!

హీరో నిఖిల్ సంక్రాంతి సందడి

నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నా..!

మరో సినిమా మొదలుపెట్టిన 'నిఖిల్'

గ్రీస్ దేశంలో "కార్తికేయ 2" షూటింగ్

'కార్తికేయ 2' హీరోయిన్ ను పరిచయం చేసిన నిఖిల్

యూరోప్ , వియత్నాం లలో "దైవం మనుష్య రూపేణా "

షూట్ మోడ్ లో నిఖిల్

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం

రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్

"కార్తికేయ 2 " రిలీజ్ పై నిఖిల్ క్లారిటీ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

"కార్తికేయ 2 "మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

దసరా బరిలో నిఖిల్ 'స్పై'
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వెండితెరపై కనిపించి చాలా రోజులే అవుతుంది. అర్జున్ సురవరం సినిమా తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. మధ్యలో కరోనా వల్ల కూడా తన సినిమాలు రావడానికి లేట్ అయ్యింది. అయితే ఈ ఏడాది మాత్రం తన అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు…

యంగ్ హీరో 'నిఖిల్' తండ్రి కన్నుమూత
టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఏదో ఒక విషాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఈమధ్య సెలబ్రిటీల మరణవార్తలను ఎక్కువగా వినాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులను కోల్పోయింది చిత్రపరిశ్రమ. రీసెంట్ గానే ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ కన్ను మూశారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి కాస్త విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. మరోవైపు నిఖిల్ తండ్రి చనిపోవడంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు…

"18 పేజెస్"మూవీ గ్లింప్స్ రిలీజ్
అల్లు అరవింద్ సమర్పణ లో సుకుమార్ రైటింగ్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “కుమారి 21 F “మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలోనిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన “18 పేజెస్ “మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'కార్తికేయ2' షూటింగ్ అప్ డేట్..!
యంగ్ హీరో నిఖిల్ నుండి సినిమా వచ్చి కూడా చాలా రోజులవుతుంది. అయితే తను ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఆ సినిమాల షూటింగ్స్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక నిఖిల్ కార్తికేయ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తుంది. కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో ఈ సీక్వెల్ పై కూడా మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలైన కూడా ఈసినిమాకు కరోనా వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. దీంతో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా చాలా లేట్ అయింది.

లైవ్ వెపన్స్ ట్రైనింగ్ లో నిఖిల్
సక్సెస్ ఫుల్ “అర్జున్ సురవరం “మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన “18 పేజెస్”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “మూవీ సెట్స్ పైన ఉంది. ఈ మూవీ లో కూడా అనుపమ కథానాయిక. ఐ డి ఎంటర్ టైన్ మెంట్స్ , రెడ్ సినిమాస్ బ్యానర్స్ పై గారి బి హెచ్ దర్శకత్వంలో నిఖిల్ , ఐశ్వర్య మీనన్ జంటగా తెరకెక్కుతున్న “నిఖిల్ 19″మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే.

'18 పేజెస్'.. అనుపమ బర్త్ డే పోస్టర్ రిలీజ్..!
కెరీర్ ప్రారంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తన ఉంగరాల జుట్టుతో, అభినయంతో ఎంతో మంది యువతకు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే మధ్యలో కాస్త ఫ్లాప్స్ తో కెరీర్ డల్ అయినా ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ అయిపోయింది. రీసెంట్ గానే రౌడీ బాయ్స్ సినిమాతో హిట్ ను అందుకోగా ప్రస్తుతం పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

పాండమిక్ ఎఫెక్ట్ కెరీర్స్ పై చాలా పడింది..!
కరోనా వల్ల గత రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో చూస్తున్నాం. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రిలీజ్ డేట్ ప్రకటించినా కూడా చెప్పిన డేట్ కే రిలీజ్ అవుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఇక ఈ కరోనా వల్ల స్టార్ హీరోలకు ప్రాబ్లమ్ లేకపోయినా.. ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్న యంగ్ హీరోల కెరీర్ కు మాత్రం కష్టమనే చెప్పొచ్చు. కాస్త సినిమాలు రిలీజ్ అయి హిట్లు పడితేనే కెరీర్ కొనసాగుతుంది. ఇప్పుడు ఇదే విషయంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్.

హీరో నిఖిల్ సంక్రాంతి సందడి
సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం "మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన "18 పేజెస్"మూవీ ఫిబ్రవరి 18 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 "మూవీ సెట్స్ పైన ఉంది. ఐ డి ఎంటర్ టైన్ మెంట్స్ , రెడ్ సినిమాస్ బ్యానర్స్ పై గారి బి హెచ్ దర్శకత్వంలో నిఖిల్ , ఐశ్వర్య మీనన్ జంటగా తెరకెక్కే "నిఖిల్ 19"మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే.

నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నా..!
యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్య నిఖిల్ సినిమాలు ఒకటి కూడా రిలీజ్ కాకపోయినా వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ ఖాతాలో నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఇంతకుముందు ఒక సినిమా తరువాత ఒక సినిమా చేశాననీ, ఈ సారి మాత్రం ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పాడు.. అంతేకాదు నాలుగు పిల్లల్లో ఎవరు ఎక్కువ ఇష్టమంటే ఏం చెబుతాం .. ఇది కూడా అంతే అంటూ చమత్కరించాడు. ఈ సినిమాలన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశాడు.

మరో సినిమా మొదలుపెట్టిన 'నిఖిల్'
యంగ్ హీరో నిఖిల్ మాత్రం తన జోరును అస్సలు తగ్గించట్లేదు. హ్యాపీడేస్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నిఖిల్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కథల విషయంలో కాస్త తడబడ్డాడు.. ఆ తర్వాత మంచి కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసందే. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక…

గ్రీస్ దేశంలో "కార్తికేయ 2" షూటింగ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ కి “దైవం మనుష్య రూపేణా ” టైటిల్ ను దర్శక , నిర్మాతలు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ లో స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

'కార్తికేయ 2' హీరోయిన్ ను పరిచయం చేసిన నిఖిల్
నిఖిల్, చందూ మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కార్తికేయ 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ లు పడగా..ఇటీవలే షూట్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ను కాస్త డిఫరెంట్గా పరిచయం చేశాడు నిఖిల్. ‘ఈ సినిమాలో నాయిక ఎవరనే విషయాన్ని చాలా రోజులు రహస్యంగా ఉంచాం.. ఇప్పుడు బయటపెడుతున్నాం. అనుపమతో మరోసారి నటించడం ఆనందంగా ఉంది’ అని…

యూరోప్ , వియత్నాం లలో "దైవం మనుష్య రూపేణా "
విభిన్న కథా చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ , స్వాతి జంటగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ "ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 "తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో షూటింగ్ జరుపుకున్న "కార్తికేయ 2 " మూవీ ఆగస్ట్ నుండి యూరప్, వియత్నాం వంటి దేశాల్లో చిత్రీకరణ కు దర్శకుడు ప్లాన్ చేశారు.

షూట్ మోడ్ లో నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ ", చందు మొండేటి దర్శకత్వంలో "కార్తికేయ 2 " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిఖిల్ తన వంతు సాయంగా హాస్పిటల్ బెడ్స్ , మెడిసిన్స్ , ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడానికి నిఖిల్ నిర్ణయం తీసుకున్నారు.

ఇంట్రెస్టింగ్ గా నిఖిల్ '18 పేజీస్' ప్రీ లుక్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజీస్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్ రెండు రోజుల క్రితమే ఇచ్చింది చిత్రయూనిట్. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న '18 పేజీస్' ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి , రిలీజ్ లు ఆగిపోయి చిత్రపరిశ్రమ పలు విధాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. 9 నెలల తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడింది. తిరిగి కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్స్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మూవీ రిలీజ్ లు వాయిదా పడ్డాయి. యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.

రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమా రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమాల షూటింగ్ లను కూడా వాయిదా వేసుకుంటున్నారు పలువురు హీరోలు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ లాంటి వాళ్లు సెల్ప్ ఐసోలేషన్ కు వెళ్లారు. ఇక తాజాగా యంగ్ హీరో నిఖిల్ కూడా తన సినిమాల షూటింగ్ లను వాయిదా వేసుకున్నాడు.

"18 పేజెస్ " మూవీ లేటెస్ట్ అప్ డేట్
సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం "మూవీ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నిఖిల్ వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరో నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2" , "18 పేజెస్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి .