టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వెండితెరపై కనిపించి చాలా రోజులే అవుతుంది. అర్జున్ సురవరం సినిమా తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. మధ్యలో కరోనా వల్ల కూడా తన సినిమాలు రావడానికి లేట్ అయ్యింది. అయితే ఈ ఏడాది మాత్రం తన అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాతో పాటు నిఖిల్ చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు గారీ బి.హెచ్ దర్శకత్వంలో మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగును జరుపుకుంటోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దసరా బరిలో ఈసినిమాను దించాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: