ట్యాగ్ · 54 కథనాలు · పేజీ 3

నిఖిల్ 20.. అధికారిక ప్రకటన వచ్చేసింది
మరోసారి జంటగా నిఖిల్ , లావణ్య త్రిపాఠి ?
దర్శకుడు ఆర్ జి వి కి నిఖిల్ కౌంటర్
సిక్స్ ప్యాక్ మళ్ళీ సిద్ధం - నిఖిల్
హీరో నిఖిల్ భావోద్వేగం
లాక్ డౌన్ పై నిఖిల్ ట్వీట్
నిఖిల్ కు జోడీ గా సిద్ధి ఇద్నాని
కార్తికేయ 2 సీక్వెల్ కాదు..!

`18 పేజెస్`లో అను ఇమ్మాన్యుయేల్?

ఒకే రోజు వివాహం
హీరో నిఖిల్ ప్రేమ, పెళ్ళి కథ

హీరో నిఖిల్ "పెళ్ళి సందడి"
'కార్తికేయ 2' రెడీ టూ షూట్
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు కార్తికేయ 2 సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే నిజానికి గత ఏడాది ఉగాది నుండే షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఇప్పుడు అన్ని సినిమాల షూటింగ్ లు మొదలవుతుండటంతో ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్రయూనిట్.
గ్రీన్ ఛాలెంజ్ పూర్తి - యంగ్ హీరోయిన్స్ కు ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరో నిఖిల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. రాజా రవీంద్ర విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నిఖిల్ తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో మొక్కలు నాటారు.

నిఖిల్ 20.. అధికారిక ప్రకటన వచ్చేసింది
మొత్తానికి యంగ్ హీరో నిఖిల్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2', పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో '18 పేజెస్' చిత్రాలు చేస్తున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.
మరోసారి జంటగా నిఖిల్ , లావణ్య త్రిపాఠి ?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "కుమారి 21 F "ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా "18 పేజెస్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. "18 పేజెస్ " మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
దర్శకుడు ఆర్ జి వి కి నిఖిల్ కౌంటర్
ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల విమర్శలు అందుకుంటున్నారు. వర్మ ప్రస్తుతం "పవర్ స్టార్ " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇది పవర్ స్టార్ బయోపిక్ కాదు అని అనౌన్స్ చేసిన వర్మ పవన్ కళ్యాణ్ , చిరంజీవి పోలిన మనుషులతో "పవర్ స్టార్ " మూవీ ని రూపొందిస్తున్నారు. ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ పరిస్థితి గురించి ఈ మూవీ రూపొందించినట్టుగా ఉంది.
సిక్స్ ప్యాక్ మళ్ళీ సిద్ధం - నిఖిల్
సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్ " మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ "యువత ", "స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ "కార్తికేయ " మూవీ సీక్వెల్ "కార్తికేయ 2", పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి.
హీరో నిఖిల్ భావోద్వేగం
భారత్ , చైనా బోర్డర్ లద్ధాఖ్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. వారిలో సూర్యాపేట కు చెందిన కర్నల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ , వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియా , చైనా బోర్డర్ లో జరిగిన సంఘటనకు రక్తం మరిగిపోతుందని, చైనా వస్తువులు బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
లాక్ డౌన్ పై నిఖిల్ ట్వీట్
"అర్జున్ సురవరం "మూవీ సక్సెస్ తో హీరో నిఖిల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ప్రస్తుతం "కార్తికేయ 2", "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్నారు. ప్రేమించిన యువతి ని పెళ్ళి చేసుకుని వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ లాక్ డౌన్ పై చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
నిఖిల్ కు జోడీ గా సిద్ధి ఇద్నాని
"అర్జున్ సురవరం "మూవీ విజయం తో యువ హీరో నిఖిల్ సినిమాల జోరు పెంచారు. చందు మొండేటి దర్శకత్వంలో "కార్తికేయ 2", సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ "మూవీస్ లో నిఖిల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ "కుమారి 21 F "మూవీ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18 పేజెస్ "మూవీ రూపొందనుంది.
కార్తికేయ 2 సీక్వెల్ కాదు..!
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభించనున్నారు.

`18 పేజెస్`లో అను ఇమ్మాన్యుయేల్?
యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజెస్’. ‘కుమారి21 ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పూర్వ నిర్మాణ దశలో ఉంది.

ఒకే రోజు వివాహం
టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ ల వివాహాలు ఏప్రిల్ 16 వ తేదీ జరుగనున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన నిఖిల్ "అర్జున్ సురవరం", నితిన్ "భీష్మ " మూవీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ హైదరాబాదీ మ్యారేజ్ చేసుకుంటుండగా, నితిన్ తన మ్యారేజ్ ను దుబాయ్ లో ప్లాన్ చేశారు. ఇద్దరిదీ ప్రేమ వివాహం కావడం విశేషం.
హీరో నిఖిల్ ప్రేమ, పెళ్ళి కథ
ఫిబ్రవరి 1వ తేదీ హీరో నిఖిల్ కు డాక్టర్ పల్లవి కి పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహం ఏప్రిల్ 16వ తేదీ జరుగనుంది. ప్రేమ తన జీవితంలో పెను మార్పు తెచ్చిందన్న నిఖిల్ తన ప్రేమ కథ, పెళ్ళి గురించి ఇలా చెప్పారు.

హీరో నిఖిల్ "పెళ్ళి సందడి"
"హైదరాబాద్ నవాబ్స్ " మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నిఖిల్ సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నిఖిల్ హీరోగా నటించిన "స్వామి రా రా", "కార్తికేయ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా", "అర్జున్ సురవరం" మూవీస్ ఘనవిజయం సాధించాయి. నిఖిల్ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ "కార్తికేయ" కు సీక్వెల్ గా రూపొందనున్న "కార్తికేయ 2" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.