నిఖిల్, చందూ మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో కార్తికేయ 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ లు పడగా..ఇటీవలే షూట్ ను రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ను కాస్త డిఫరెంట్గా పరిచయం చేశాడు నిఖిల్. ‘ఈ సినిమాలో నాయిక ఎవరనే విషయాన్ని చాలా రోజులు రహస్యంగా ఉంచాం.. ఇప్పుడు బయటపెడుతున్నాం. అనుపమతో మరోసారి నటించడం ఆనందంగా ఉంది’ అని నిఖిల్ వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
కాగా వీరిద్దరి కాంబినేషన్ లో 18 పేజీస్ అనే మరో సినిమా కూడా వస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























