కెరీర్ ప్రారంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తన ఉంగరాల జుట్టుతో, అభినయంతో ఎంతో మంది యువతకు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే మధ్యలో కాస్త ఫ్లాప్స్ తో కెరీర్ డల్ అయినా ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ అయిపోయింది. రీసెంట్ గానే రౌడీ బాయ్స్ సినిమాతో హిట్ ను అందుకోగా ప్రస్తుతం పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు అనుపమ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాల నుండి అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే 18 పేజెస్ నుండి కూడా ఒక అప్ డేట్ వచ్చింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇంకా ఈసినిమాతో పాటు నిఖిల్ కార్తికేయ2 సినిమాలో కూడా అనుపమనే హీరోయిన్ గా నటిస్తుంది.
View this post on Instagram
ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: