సక్సెస్ ఫుల్ “అర్జున్ సురవరం “మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన “18 పేజెస్”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “మూవీ సెట్స్ పైన ఉంది. ఈ మూవీ లో కూడా అనుపమ కథానాయిక. ఐ డి ఎంటర్ టైన్ మెంట్స్ , రెడ్ సినిమాస్ బ్యానర్స్ పై గారి బి హెచ్ దర్శకత్వంలో నిఖిల్ , ఐశ్వర్య మీనన్ జంటగా తెరకెక్కుతున్న “నిఖిల్ 19″మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నిఖిల్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో నటిస్తున్నారు. “నిఖిల్ 19″ మూవీ లో నిఖిల్ గూఢచారిగా నటిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తయింది. మరో షెడ్యూల్ మనాలిలో మార్చి నెలలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించనున్నారు. లైవ్ వెపన్ ట్రైనింగ్ తీసుకున్న నిఖిల్, లైవ్ వెపన్స్ ట్రైనింగ్… గారీతో ఒక అడ్రినలిన్ పంపింగ్ ప్రాజెక్ట్ కోసం అంటూ నిజమైన గన్ ని గురి పెడుతున్న ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: