కరోనా వల్ల గత రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో చూస్తున్నాం. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రిలీజ్ డేట్ ప్రకటించినా కూడా చెప్పిన డేట్ కే రిలీజ్ అవుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఇక ఈ కరోనా వల్ల స్టార్ హీరోలకు ప్రాబ్లమ్ లేకపోయినా.. ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్న యంగ్ హీరోల కెరీర్ కు మాత్రం కష్టమనే చెప్పొచ్చు. కాస్త సినిమాలు రిలీజ్ అయి హిట్లు పడితేనే కెరీర్ కొనసాగుతుంది. ఇప్పుడు ఇదే విషయంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాండమిక్ ఎఫెక్ట్ ప్రభావం కెరీర్స్ పై చాలా పడింది.. చాలా బాధగా ఉంది.. అర్జున్ సురవరం సినిమా సక్సెస్ తరువాత నాలుగు మంచి కథలను సెలక్ట్ చేసుకున్నాను. నాలుగు స్క్రిప్ట్స్ పై చాలా నమ్మకం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ డేట్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాయి.. ఈ పరిస్థితుల నుంచి బయట పడేయాలని, సినిమాలను అనుకున్న సమయానికి విడుదల చేసేలా చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
Very sad to c this Pandemic affect careers on this level..
After the succes of #ArjunSuravaram I signed 4 movies… 4 brilliant scripts that I am very confident about. But Release dates have all gone Haywire.
Praying to God this all sorts out & we release the movies Perfectly— Nikhil Siddhartha (@actor_Nikhil) January 26, 2022
కాగా ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇంకా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ2 సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎడిటర్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు సుదీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి స్వామి రారా, కేశవ సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: