యంగ్ హీరో నిఖిల్ మాత్రం తన జోరును అస్సలు తగ్గించట్లేదు. హ్యాపీడేస్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నిఖిల్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కథల విషయంలో కాస్త తడబడ్డాడు.. ఆ తర్వాత మంచి కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసందే. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాతో పాటు నిఖిల్ చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. ఎడిటర్ గారీ బి.హెచ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాతో గారీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇక ఈసినిమా హైద్రాబాద్ లో నేడు గ్రాండ్ గా లాంచ్ అయింది. కె. రాజ శేఖర్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నాడు. రాజ శేఖర్ రెడ్డి క్లాప్ కొట్టగా.. శరత్ మారర్, జెమిని కిరణ్ ఇంకా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ ను అందించాడు. రెగ్యులర్ షూటింగ్ నేటి నుండే మొదలవుతుంది.
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: