ట్యాగ్ · 159 కథనాలు · పేజీ 8
'పవర్' సినిమా నా కెరీర్‌ను మార్చేసింది
మాస్ టైటిల్ తో రవితేజ మూవీ ?
పెట్ డాగ్స్ తో రవితేజ
రవితేజ-మారుతి కాంబినేషన్ లో మూవీ..?

10 వసంతాల "డాన్ శీను "

డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?

ముగ్గురు నాయికలతో రవితేజ సందడి
వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో ?
లక్కీ డేట్‌ని మిస్ చేసుకుంటున్న మాస్ మహారాజా
మాస్ మహారాజా సరసన నివేత పెతురాజ్?
మాస్ మహారాజా రవితేజ కు జోడీ గా త్రిష ?

మరోసారి రవితేజకి జోడీగా త్రిష?
రిపీట్ మోడ్ లో రవితేజ రొమాన్స్

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రవితేజ `క్రాక్`
వక్కంతం వంశీ డైరెక్షన్ లో రవితేజ సినిమా

`కిలాడి`గా రవితేజ?

బాలీవుడ్ బ్యూటీతో రవితేజ?
మిస్సింగ్ ది సెట్స్ -రవితేజ
మాస్ మహారాజా రవితేజ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండగా కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. 6నెలల తరువాత షూటింగ్స్ ప్రారంభం కావడంతో "క్రాక్ " మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
'పవర్' సినిమా నా కెరీర్‌ను మార్చేసింది
సినీ పరిశ్రమలో బాబిగా ఎంట్రీ అయిన ఈ యంగ్ డైరెక్టర్ అతి తక్కువటైంలోనే పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా పవర్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బాబి తొలి సినిమాతోనే విజయం అందుకున్నాడు. ఆ తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా తీసి హిట్ కొట్టాడు. గత ఏడాది వెంకీమామ సినిమాతో సందడి చేసాడు.
క్రాక్ నుండి రవితేజ కొత్త స్టిల్ రిలీజ్ - చివరి షెడ్యూల్ ప్లాన్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకొని గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పటీకే విడుదల చేసిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు, టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
మాస్ టైటిల్ తో రవితేజ మూవీ ?
మాస్ మహారాజా రవితేజ ప్రతీ సినిమాలో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ నటించిన మూవీస్ జయాపజయాలతో సంబంధంలేకుండా రవితేజ పై క్రేజ్ ఉన్న ప్రేక్షకులు ఆయన నటనను ఆస్వాదిస్తారు. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తోపాటు రవితేజ మరికొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పెట్ డాగ్స్ తో రవితేజ
లాక్ డౌన్ లో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికే వారు రోజూ చేసే పనులు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూనే ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది తమ పెట్ డాగ్స్ తో సరదాగా ఆడుకుంటూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మాస్ మహారాజ్ కూడా తన పెట్ డాగ్స్ కు సంబంధించి ఒక ఫొటోను పోస్ట్ చేసాడు. తన డాగ్స్ ను ప్రేమతో తలపై నిమురుతూ.. దానికి మై బాయ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
రవితేజ-మారుతి కాంబినేషన్ లో మూవీ..?
టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త కొత్త కాంబినేషన్స్ లో మూవీస్ సెట్ అవుతున్నాయి. డైరెక్టర్స హీరోలకు తగినట్టు కొత్త కొత్త కథలను రాస్తున్నారు.. హీరోలు కూడా ఒకే జోనర్ కు ఫిక్స్ అవ్వకుండా కొత్త కొత్త ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆహీరో-డైరెక్టర్ ఎవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ-మారుతి. వీరిద్దరూ కలిసి త్వరలో సినిమా చేయబోతున్నట్టు టాక్స్ నడుస్తున్నాయి. ఇటీవలే మారుతి హీరో రవితేజకు కథ వినిపించారని, రవితేజ కూడా ఓకే చేశారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు? .. హీరోయిన్ ఎవరు? వంటి వివరాల్ని త్వరలోనే…

10 వసంతాల "డాన్ శీను "
ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజా హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ "డాన్ శీను " మూవీ 2010 సంవత్సరం ఆగస్ట్ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ మూవీ లో శ్రియ కథానాయిక. 5సంవత్సరాల గ్యాప్ తరువాత శ్రియ "డాన్ శీను " మూవీ లో నటించడం విశేషం. హీరో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?
"విక్రమార్కుడు ", పవర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో మాస్ మహారాజా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఎటువంటి క్యారెక్టర్ లో నైనా తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ లో నటించనున్నారు.

ముగ్గురు నాయికలతో రవితేజ సందడి
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన సైన్స్ ఫిక్షన్ మూవీ 'డిస్కో రాజా'లో ముగ్గురు కథానాయికలతో సందడి చేశాడు మాస్ మహరాజా రవితేజ. కట్ చేస్తే.. త్వరలో మరో సినిమా కోసం ఇదే బాటలో వెళ్లనున్నాడట ఈ టాలెంటెడ్ స్టార్.
వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో ?
"కిక్ ", "ఎవడు ", రేసు గుర్రం ", "టెంపర్ "వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ "నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా " మూవీ తో దర్శకుడిగా మారారు. ఆ మూవీ పరాజయం పొందడంతో దర్శకుడిగా వంశీ కి అవకాశాలు రాలేదు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కై ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను వంశీ రెడీ చేస్తున్నట్టు సమాచారం.
లక్కీ డేట్‌ని మిస్ చేసుకుంటున్న మాస్ మహారాజా
మాస్ మహారాజా రవితేజకి పోలీస్ కథలు భలేగా అచ్చొచ్చాయి. ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘టచ్ చేసి చూడు’.. ఇలా పలు చిత్రాల్లో రవితేజ ఖాకి ధరించారు. వాటిలో సింహభాగం విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ నుంచి మరో పోలీస్ స్టోరీ రాబోతోంది. ఆ మూవీనే.. ‘క్రాక్’. ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత తన లక్కీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రవితేజ నటిస్తున్న మూడో చిత్రమిది.
మాస్ మహారాజా సరసన నివేత పెతురాజ్?
'రాక్షసుడు'(2019) రూపంలో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. త్వరలో మరో యాక్షన్ థ్రిల్లర్‌తో పలకరించబోతున్నాడు. ఇందులో మాస్ మహరాజా రవితేజ కథానాయకుడిగా నటించనున్నాడు. 'వీర'(2011) తరువాత రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
మాస్ మహారాజా రవితేజ కు జోడీ గా త్రిష ?
మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ "డాన్ శీను ", పవర్ " మూవీస్ తరువాత రవితేజ , మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "క్రాక్" మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తరువాత రవితేజ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరోసారి రవితేజకి జోడీగా త్రిష?
పన్నెండేళ్ళ క్రితం సంక్రాంతికి విడుదలై విజయం సాధించిన చిత్రం `కృష్ణ` (2008). మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో టాలెంటెడ్ బ్యూటీ త్రిష నాయికగా నటించింది. ఆ సినిమా తరువాత ఈ జోడీ మళ్ళీ సందడి చేయనేలేదు. కట్ చేస్తే.. పుష్కరకాలం తరువాత రవితేజ, త్రిష కలసి నటించేందుకు రంగం సిద్ధమవుతోందట.
రిపీట్ మోడ్ లో రవితేజ రొమాన్స్
గత చిత్రం `డిస్కో రాజా`లో ముచ్చటగా ముగ్గురు కథానాయికలతో సందడి చేశాడు మాస్ మహారాజా రవితేజ. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్.. ఇలా ఇదివరకు తను జోడీకట్టని భామలతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడాయన. కట్ చేస్తే.. రాబోయే చిత్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఆల్రెడీ తను జట్టుకట్టిన నాయికలతోనే `రిపీట్` రొమాన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు రవితేజ.

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రవితేజ `క్రాక్`
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. `డాన్ శీను`, `బలుపు` చిత్రాల తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా ఇది. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్స్ లో దర్శనమివ్వనున్నారు.
వక్కంతం వంశీ డైరెక్షన్ లో రవితేజ సినిమా
వరుసగా ఓ రెండు ప్లాప్స్ వస్తే చాలు ఆ హీరోకు సినిమాలు రావడం చాలా కష్టం. కానీ మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మే 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

`కిలాడి`గా రవితేజ?
ఇటీవలే `డిస్కో రాజా`గా సందడి చేశాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం కాప్ స్టోరీ `క్రాక్`తో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ స్టార్... మే 8న సదరు సినిమాతో పలకరించబోతున్నాడు. కాగా, ఆ లోపే మరో యాక్షన్ థ్రిల్లర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు రవితేజ. `రాక్షసుడు` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. మార్చి నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి `కిలాడి` అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఈ టైటిల్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

బాలీవుడ్ బ్యూటీతో రవితేజ?
ఇటీవలే `డిస్కో రాజా`గా ఎంటర్ టైన్ చేసిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం `క్రాక్`తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ కాప్ స్టోరీ మే 8న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలయ్యేలోపే `రాక్షసుడు` దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు రవితేజ. ఇందులో మాస్ మహారాజా రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.