సినీ పరిశ్రమలో బాబిగా ఎంట్రీ అయిన ఈ యంగ్ డైరెక్టర్ అతి తక్కువటైంలోనే పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా పవర్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బాబి తొలి సినిమాతోనే విజయం అందుకున్నాడు. ఆ తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా తీసి హిట్ కొట్టాడు. గత ఏడాది వెంకీమామ సినిమాతో సందడి చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా పవర్ సినిమా రిలీజ్ అయి నేటితో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా డైరెక్టర్ బాబి తన ట్విట్టర్ ద్వారా గుర్తు చేసుకున్నాడు. రచయిత నుంచి దర్శకుడిగా `పవర్` సినిమా నా కెరీర్‌ను మార్చేసింది. నా హీరో రవితేజ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. అద్భుతమైన సంగీతం అందించిన తమన్‌కు, నా గురువు కోన వెంకట్‌కు, ఇతర చిత్రబృందానికి ధన్యవాదాల`ని బాబి పేర్కొన్నాడు.
#Power is the film which completely changed my career graph from writer to director. This won’t be possible without my hero @RaviTeja_offl garu.Thanks to@MusicThaman for outstanding music & bgm.
Tq my guru @konavenkat99, #Chakravarty & @ihansika @RocklineEnt @ReginaCassandra. pic.twitter.com/MVq8wckMBJ— Bobby (@dirbobby) September 12, 2020
ఇక, రచయిత కోన వెంకట్ కూడా ఈ సినిమా గురించి స్పందించారు. `నా కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం `పవర్`. ఈ సినిమాతో టాలీవుడ్‌కు ఓ డైనమిక్ డైరెక్టర్ దొరికాడు. రవితేజ హై వోల్టేజ్ నటన చిత్రానికి హైలైట్. చిత్రబృందం మొత్తానికి అభినందనల`ని ట్వీట్ చేశారు.
POWER.. Most memorable film of my career.. I’m happy that TFI found a new and dynamic director @dirbobby !! High voltage performance @RaviTeja_offl is unforgettable!! Congratulations to @ihansika @ReginaCassandra & @MusicThaman who had a great contribution 👏👏#6YearsForPower pic.twitter.com/n26zstJhfO
— kona venkat (@konavenkat99) September 12, 2020



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: