ట్యాగ్ · 159 కథనాలు · పేజీ 7
సెన్సార్ పూర్తి చేసుకున్న 'క్రాక్'
'క్రాక్ ట్రైలర్' - నో డౌట్.. ష్యూర్ షాట్
రవితేజ "ఖిలాడి "మూవీ అప్ డేట్
మ్యూజిక్ సిట్టింగ్స్‌లో రవితేజ 'ఖిలాడి'
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
'రాజా ది గ్రేట్' బెస్ట్ కామెడీ సీన్
టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'క్రాక్'
హైదరాబాద్ లో "ఖిలాడి "
సంక్రాంతి బరిలో "క్రాక్ "

దసరా ట్రీట్ - క్రాక్ నుండి రానున్న అప్ డేట్
రమేష్ వర్మ సినిమాలో రవితేజకు జోడీగా..?
'వర్మ' సినిమా ఆడిషన్ కోసం సింగిల్ ఫొటోతో..!
హీరో రవితేజ కు జోడీగా మీనాక్షి చౌదరి ?
'క్రాక్' ఆఖరి షెడ్యూల్ స్టార్ట్
పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మన హీరోలదే
మరోసారి జంటగా ?
పెన్ స్టూడియోస్ , ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ "రాక్షసుడు "మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఖిలాడి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హైదరాబాద్ లో జరుపుకున్న షూటింగ్ షెడ్యూల్ తో 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మరో షెడ్యూల్ ముంబై లో 15 రోజులపాటు జరగనుందని సమాచారం.
సెన్సార్ పూర్తి చేసుకున్న 'క్రాక్'
మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మూడో చిత్రం 'క్రాక్'. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘క్రాక్’ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోగా నిలవడమే గాక రవితేజ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోడమే కాదు 2 లక్షల మేర లైక్స్ ను సొంతం చేసుకుంది.
'క్రాక్ ట్రైలర్' - నో డౌట్.. ష్యూర్ షాట్
మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులకు న్యూ ఇయర్ కి మంచి ట్రీటే లభించింది అని చెప్పొచ్చు. రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను ఇంకారెట్టింపు చేసింది అని చెప్పుడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం.. గతంలో పాత రవితేజ కనిపించాడు మళ్లీ ఈ సినిమాతో అన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
రవితేజ "ఖిలాడి "మూవీ అప్ డేట్
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. పలు మూవీస్ కు పోటీగా "క్రాక్ " మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. "క్రాక్ " మూవీ విజయం పై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఈ మూవీ తరువాత హీరో రవితేజ మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మ్యూజిక్ సిట్టింగ్స్‌లో రవితేజ 'ఖిలాడి'
రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా... ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తూ ఆకట్టుకుంది.
ఫైనల్ షెడ్యూల్ కోసం 'గోవా' లో క్రాక్ టీమ్
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. 'క్రాక్' తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు వీరిద్దరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేయగా కొంత భాగం అక్కడ చిత్రీకరించారు. ఇక కొంతభాగం మిగిలిఉండగా ఇప్పుడు అది కంప్లీట్ చేయడానికి చిత్రయూనిట్ గోవా వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని రవితేజ తన ఇన్స్టా ద్వారా తెలియచేశారు. ఫైనల్ షెడ్యూల్ కోసం గోవా వెళ్తున్నట్టు పోస్ట్ లో పేర్కొన్నాడు.
'రాజా ది గ్రేట్' బెస్ట్ కామెడీ సీన్
మాస్ మహారాజ్ రవి తేజ బెంగాల్ టైగర్ సినిమా తరువాత చాలా టైం తీసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సినిమా రాజా ది గ్రేట్. అప్పటివరకూ హిట్ లేక ప్లాప్స్ తో బాధపడుతున్న రవితేజకు ఈసినిమా కాస్త ఊరటనిచ్చింది. మంచి హిట్ తెచ్చిపెట్టింది. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించగా... రవితేజకు జోడీగా మెహ్రీన్ కౌర్ పిర్జాదా నటించింది. రాధిక, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంపత్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు.బేసిక్ గా అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో…
టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'క్రాక్'
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో హీరో హీరోయిన్లు రవితేజ, శ్రుతి హాసన్‌పై ఓ పాటను చిత్రీకరించనున్నారట. ఆ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చెపుతున్నారు చిత్రయూనిట్.
హైదరాబాద్ లో "ఖిలాడి "
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "క్రాక్ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతికి రిలీజ్ కానుందని సమాచారం. ఇప్పుడు రవితేజ మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
సంక్రాంతి బరిలో "క్రాక్ "
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. థియేటర్స్ బంద్ అయ్యి , షూటింగ్స్ నిలిచిపోయి , రిలీజులు ఆగిపోయి చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురిఅయ్యింది. 6 నెలల విరామం తరువాత షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పలు మూవీస్ షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలే కాకుండా , బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అయ్యాయి. కొన్ని నియమ , నిబంధనలతో థియేటర్స్ రీ ఓపెన్ అయినా ప్రేక్షకాదరణ అంతంత మాత్రంగానే ఉంది.

దసరా ట్రీట్ - క్రాక్ నుండి రానున్న అప్ డేట్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
రవితేజ 'ఖిలాడి' ఫస్ట్ లుక్ రిలీజ్
రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను హైద్రాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమాకు ఖిలాడి అనే టైటిల్ ను పెట్టనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ఖిలాడి’ (ప్లే స్మార్ట్) అనే టైటిల్ ను పెట్టారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తుండగా, అతడిపై కరెన్సీ నోట్ల వర్షం కురుస్తుండటం ఆసక్తిని పంచుతోంది.
రవితేజ 67 సినిమా ఫస్ట్‌లుక్ అప్‌డేట్
'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను ప్రకటించారు కూడా. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
మాస్ మహారాజ్ తో వర్మ హీరోయిన్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
రమేష్ వర్మ సినిమాలో రవితేజకు జోడీగా..?
మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
'వర్మ' సినిమా ఆడిషన్ కోసం సింగిల్ ఫొటోతో..!
సినీ ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ అవ్వడం అనేది కొంచం ఈజీనే. అయితే ఆ తర్వాత ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం.. టాలెంట్ ను ప్రూవ్ చేసుకోడం అంటే మాత్రం చాలా కష్టం. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం అంటే అబ్బో చాలా కష్టమే. ఒకరకంగా అన్నిటిని వొదిలేసి భగీరధ ప్రయత్నం చేస్తే కానీ ఒక సినిమాలో హీరో అయ్యే ఛాన్స్ రాదు. ఇప్పుడంటే ఏదో టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా పుణ్యమా అని అది ఈజీ అయింది కానీ.. ఒకప్పుడు మాత్రం చాలా కష్టమయ్యేది. అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. స్టార్ హీరోలు అయిన వాళ్లు చాలా తక్కువమంది. అలా స్వయం కృషితో సినీ పరిశ్రమను ఏలింది మెగా…
హీరో రవితేజ కు జోడీగా మీనాక్షి చౌదరి ?
మాస్ మహారాజా రవి తేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని , రవితేజ హిట్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ "క్రాక్ " మూవీ షూటింగ్ 6 నెలల తరువాత హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. ఈ మూవీ తరువాత రవితేజ , దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'క్రాక్' ఆఖరి షెడ్యూల్ స్టార్ట్
ఫైనల్ గా రవితేజ కూడా సెట్స్ లోకి అడుగుపెట్టాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే 90 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. లాక్ డౌన్ విధించడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే పాటలు, ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.
పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మన హీరోలదే
ఒకప్పుడు లాగ కాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. యంగ్ హీరోస్ అంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ తోడుగా వుంటున్నారు. అంతేకాదు ఒకరి సినిమా ప్రమోషన్స్ లో మరొకరు పాల్గొంటూ అటు సినిమాకు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా.. ఫ్యాన్స్ కు కూడా తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు.. మీరు కూడా ఫ్రెండ్లీ గా ఉండాలని పరోక్షంగా చెపుతున్నారు. ఇండస్ట్రీలో మహేష్ – తారక్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్, గోపి చంద్ – ప్రభాస్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ – ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్.. మంచు మనోజ్ అయితే అందరి కుర్ర హీరోలతో ఫ్రెండ్లీ గా ఉంటాడు. ఇంకా ఇలాంటి ఫ్రెండ్ షిప్పులు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.
హీరో రవితేజ మూవీ లో కేథరీన్ స్పెషల్ సాంగ్ ?
దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న "క్రాక్ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత రవితేజ హీరోగా సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ఒక మూవీ తెరకెక్కనుంది.