మాస్ మహారాజా రవితేజ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండగా కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. 6నెలల తరువాత షూటింగ్స్ ప్రారంభం కావడంతో “క్రాక్ ” మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న “క్రాక్ ” మూవీలో హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. సూపర్ హిట్ “డాన్ శీను”, “బలుపు ” మూవీస్ తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేని , హీరో రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “క్రాక్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “మిస్సింగ్ ది సెట్స్, షూట్ స్టార్ట్స్ సూన్” అంటూ లాక్ డౌన్ కు ముందు షూటింగ్ లో ఫిట్ గా , స్టైలిష్ గా ఉన్న తన ఫొటోస్ ను రవితేజ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో హైప్ క్రియేట్ అయిన “క్రాక్ ” మూవీకి థమన్ ఎస్ సంగీతం అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: